కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దసరాకు ముందే డీఏ!!!
X
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుంది. పెరుగుతున్న జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని డియర్ నెస్ అలవెన్స్(DA)పై శుభవార్త వినిపించడానికి సిద్ధమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు 3 శాతం DA పెంపును కేంద్రం వర్తింపచేయనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ ప్రతిపాదిత పెంపు తర్వాత ప్రస్తుతమున్న 42 శాతం DA కాస్తా 45 శాతానికి చేరుకోనుంది. దసరా, దీపావళి పండుగలకు ముందే ఈ పెంపు గురించి కేంద్రం ప్రకటన చేసే అవకాశం ఉంది.
ప్రతినెలా లేబర్ బ్యూరో విడుదల వినియోగదారు ధరల సూచిన(CPI-IW) ఆదారంగా కేంద్రం DAను నిర్ణయిస్తూ ఉంటుంది. ప్రస్తుతం కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు డియర్ నెస్ అలవెన్స్ పొందుతున్నారు. కాగా చివరిసారి మార్చి 24, 2023న మోదీ సర్కారు DA ను సవరించింది. ఇదికాస్తా జనవరి 1, 2023 నుంచి అమల్లోకి వచ్చింది. 'జూన్ 2023కి సంబంధించిన CPI-IW డేటా జూలై 31, 2023న విడుదలైంది. డియర్‌నెస్ అలవెన్స్‌లో 4 శాతం పెంపును డిమాండ్ చేస్తున్నాము. కానీ DA పెంపు 3 శాతం కంటే కొంచెం ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. అయితే దీనికి ప్రభుత్వం కారణం కాదు' అని ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ శివ గోపాల్ మిశ్రా ఇటీవల తెలిపారు.
ఈ ఏడాదిలో ఇప్పటికే ఒకసారి డీఏ పెంపు జరగ్గా.. రెండోసారి ఈ నెలలోనే పెరగబోతోందని తెలుస్తోంది. సెప్టెంబర్ 27న డీఏ పెంపు ఉండొచ్చని నివేదికలు వెలువడుతున్నాయి. ఇదే జరిగితే ఉద్యోగులకు బంపర్ బొనాంజా అనే చెప్పుకోవచ్చు. ఒకవేళ డియర్‌నెస్ అలవెన్స్ అనేది 4 శాతం మేర పెరిగితే.. బేసిక్ శాలరీ రూ. 30 వేలు ఉన్నవారికి .. అప్పుడు జీతం నెలకు రూ. 1200 మేర పైకి చేరుతుంది. అంటే ఏడాదికి పెంపు రూ. 14,400 ఉంటుంది. అదే కేబినెట్ సెక్రటరీ లెవెల్ ఆఫీసర్స్ విషయానికి వస్తే.. వేతన పెంపు నెలకు రూ. 10 వేలు ఉండొచ్చు. కేబినెట్ సెక్రటరీ లెవెల్ ఉద్యోగులకు బేసిక్ శాలరీ రూ.2.5 లక్షల వరకు ఉంటుంది. వీరికి డీఏ పెంపు వల్ల వేతనం ఏడాదికి రూ. 1.2 లక్షల వరకు పైకి చేరుతుంది.