Home > జాతీయం > దారుణం.. దళిత మహిళను వివస్త్రను చేసి, మూత్రం తాగించారు

దారుణం.. దళిత మహిళను వివస్త్రను చేసి, మూత్రం తాగించారు

దారుణం.. దళిత మహిళను వివస్త్రను చేసి, మూత్రం తాగించారు
X

తీసుకున్న అప్పుకు వడ్డీ చెల్లించలేదంటూ.. "తండ్రీ కొడుకులు ఒక దళిత మహిళపై దారుణానికి ఒడిగట్టారు". ఆమెను వివస్త్రను చేసి కర్రలతో చితకబాదారు. ఆ తర్వాత బలవంతంగా ఆమెతో మూత్రం తాగించారు. బీహార్‌లోని పాట్నా జిల్లా మొశింపుర్ గ్రామంలో ఖుర్సుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో బాధిత మహిళ ప్రాణాలతో పోరాడుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

బీహార్‌లోని పట్నాకు చెందిన ఓ మహిళ కొన్ని నెలల క్రితం ప్రమోద్ సింగ్ అనే వ్యక్తి వద్ద వడ్డీకి రూ.9000 అప్పుగా తీసుకుంది. అయితే ఆ మొత్తం నగదును వడ్డీతో సహా తిరిగి చెల్లించింది. అయినప్పటికీ ప్రమోద్‌ సింగ్‌ అదనంగా రూ.1500 డబ్బు చెల్లించాలని మహిళను డిమాండ్‌ చేశాడు. అందుకు ఆమె నిరాకరించింది. ఎక్కువ డబ్బులు ఇవ్వకుంటే వివస్త్రను చేసి ఊరంతా ఊరేగిస్తానని ప్రమోద్ సింగ్‌ మహిళను పలుమార్లు బెదిరించాడు. ఈ బెదిరింపులపై మహిళ గతంలో పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో రెచ్చిపోయిన నిందితుడు ప్రమోద్‌ సింగ్‌, అతని కుమారుడు అన్షు, మరో నలుగురు సహచరులతో కలిసి శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో దళిత మహిళ ఇంటికి వెళ్లి బలవంతంగా ఆమెను ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చారు. ఆమెపై దారుణంగా దాడి చేసి వివస్త్రను చేసి, కర్రలతో తీవ్రంగా కొట్టారు.

అక్కడితో ఆగకుండా తన కుమారుడితో మహిళ నోట్లో మూత్రం పోయించాడు. అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు.. వెంటనే పోలీస్‌ స్టేషన్‌కు పరుగు తీసింది. ఈ ఘటనలో మహిళ తలకు బలమైన గాయాలు కాగా కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అనంతరం బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రస్తుతం ప్రధాన నిందితుడితోపాటు అతని కుమారుడు, సహకరించిన నలుగురూ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చేపట్టినట్లు డీఎస్పీ ఫతుహా ఎస్ యాదవ్ తెలిపారు.

Updated : 25 Sep 2023 8:44 AM GMT
Tags:    
Next Story
Share it
Top