Home > జాతీయం > ఆ గొడవతో వందేళ్ల తర్వాత ఆలయంలోకి దళితులు

ఆ గొడవతో వందేళ్ల తర్వాత ఆలయంలోకి దళితులు

ఆ గొడవతో వందేళ్ల తర్వాత ఆలయంలోకి దళితులు
X

ఒకే ఊరికి చెందిన ఇద్దరు యువకుల మధ్య జరిగిన చిన్న గొడవ.. ఓ ఉద్యమానికే దారి తీసింది. ఫలితంగా అప్పటివరకూ దళితుల ఆలయ ప్రవేశంపై ఉన్న నిషేధం కాస్త ఒక్కసారిగా తొలగిపోయింది. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో ఈ అపూర్వమైన ఘటన చోటు చేసుకుంది. వందేళ్ల తరువాత చెల్లన్‌కుప్పం గ్రామంలోని మారియమ్మన్ ఆలయంలోకి దళితులు ప్రవేశించారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది.





అయితే ఆలయంలోకి అనేక దళిత కుటుంబాల ప్రవేశంతో.. గొడవలు ఏవైనా జరుగుతాయోమో అని గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. అయితే వారు ఊహించనట్టుగా వేరే సామాజికవర్గాల ప్రజలనుంచి ఇప్పటివరకు ఎలాంటి నిరసన నమోదు చేయలేదు. జులైలో దళితులు, వన్నియార్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అదే గ్రామానికి చెందిన ఇద్దరూ చెన్నైలో ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటుంన్నారు. చిన్నతనంలో అదే ఊరిలోని ఒకే పాఠశాలలో చదువుకున్న ఆ ఇద్దరూ... ఈ విషయంపై మొదట సోషల్ మీడియాలో వాదించుకున్నారు. ఆ తర్వాత గ్రామంలో కలుసుకున్నప్పుడు ఘర్షణకు దిగారు.





ఈ గొడవతో తమను ఆలయంలోకి అనుమతించాలంటూ దళిత వర్గానికి చెందిన యువకుడు.. జిల్లా రెవెన్యూ, పోలీసు అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. బుధవారం తాము ఆలయంలోకి ప్రవేశిస్తామని ప్రకటించడంతో డీఐజీ (వెల్లూరు రేంజ్) ఎంఎస్ ముత్తుసామి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. “కొత్తగా పెళ్లయిన వ్యక్తులు ఈ ఆలయంలో మొక్కుకుంటే.. పొంగలి వండిపెడితే.. వారు కోరుకున్నది నెరవేరుతుందని బలమైన నమ్మకం. కానీ మమ్మల్ని ఎప్పుడూ అక్కడికి అనుమతించలేదు. ఆలయంలోకి ప్రవేశించడానికి, దేవుడ్ని కొలవడానికి, పూజలు చేయడానికి, పొంగలి వండడానికి మా మొక్కులు తీర్చుకోవడానికి జిల్లా అధికారులు మాకు సహాయం చేసినందుకు ఈ రోజు సంతోషంగా ఉన్నాం” అని 50 ఏళ్ల దళిత మహిళ అన్నారు. ఇప్పటి వరకు దళితులు గ్రామంలో 30 ఏళ్ల క్రితం నిర్మించిన కాళియమ్మాళ్ ఆలయంలో మొక్కులు తీర్చుకునేవారు.







Updated : 3 Aug 2023 2:23 PM IST
Tags:    
Next Story
Share it
Top