Home > జాతీయం > సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి మనవడు

సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి మనవడు

సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి మనవడు
X

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌కు ముఖ్యమంత్రిగా, అలాగే ఏఐసీసీ అధ్యక్షుడిగా సేవలందించిన దామోదరం సంజీవయ్య మనవడు.. ప్రస్తుతం సెక్యూరిటీ గార్డుగా అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అనంతపురంలో ఉంటున్న దివంగత నేత సంజీవయ్య మనవడు శ్రీధర్ గాంధీ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పారు. తాను ఎల్ అండ్ టీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నట్లు చెప్పారు. సీనియార్టీని బట్టి సూపర్‌వైజర్ క్యాడర్ వస్తుందని.. తాను ప్రస్తుతం కాంట్రాక్ట్ లెబర్‌లో పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మాజీ ముఖ్యమంత్రి సీఎం మనవడిగా తనను తాను పరిచయం చేసుకోవడం కాస్త ఇబ్బందిగానే ఉంటుందని.. కానీ నిజాయితీతోనే బతుకుతున్నాని చెప్పారు. నిజాయితీగా ఒకపూట తిన్నా చాలని.. ఈ ఉద్యోగంతో తాను సంతోషంగా ఉన్నానని తెలిపారు.



గతంలో రాహుల్ గాంధీ కూడా సంజీవయ్య ఇంటికి వచ్చారని.. ఎన్నికల సమయంలో అందరూ వస్తారన్నారు శ్రీధర్. అయితే తానెవరినీ సాయం చేయమని అడగలేదన్నారు. తన తండ్రి రిటైర్ అయ్యాక కాంగ్రెస్ పార్టీలో పనిచేశారని.. తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదన్నారు. రాజకీయాల్లోకి వచ్చి తమ పెద్దలకు చెడ్డ పేరు తెస్తామేమోనన్న భయం ఉందన్నారు. సోషల్ మీడియాలో శ్రీధర్ గాంధీ వీడియో వైరల్ అవుతోంది. మాజీ ముఖ్యమంత్రి మనవడి పరిస్థితి ఇలా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

దామోదరం సంజీవయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జనవరి 11, 1960 నుంచి మార్చి 12, 1962వరకు బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన స్వగ్రామం కర్నూలు జిల్లా పెదపాడు. 1950లో తాత్కాలిక పార్లమెంటు సభ్యుడు అయ్యారు. 1952 ఎన్నికల్లో పత్తికొండ, ఎమ్మిగనూరు ద్విసభ్య స్థానం నుంచి పోటీచేసి గెలిచారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రాజాజీ మంత్రివర్గంలో పనిచేశారు.

Updated : 26 Jun 2023 4:07 AM GMT
Tags:    
Next Story
Share it
Top