Home > జాతీయం > Ayodhya Ram Mandir : అయోధ్య రామ మందిర హారతి, దర్శనం టైమింగ్స్ ఇవే.. టికెట్స్ ఇలా బుక్ చేసుకోవాలి

Ayodhya Ram Mandir : అయోధ్య రామ మందిర హారతి, దర్శనం టైమింగ్స్ ఇవే.. టికెట్స్ ఇలా బుక్ చేసుకోవాలి

Ayodhya Ram Mandir : అయోధ్య రామ మందిర హారతి, దర్శనం టైమింగ్స్ ఇవే.. టికెట్స్ ఇలా బుక్ చేసుకోవాలి
X

అయోధ్యలో అపూర్వ ఘట్టం అవిష్కృతమైంది. బాలరాముడిప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సోమవారం (జనవరి 22) మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్లకు అభిజీత్ ముహూర్తంలో 84 సెకన్లకు ఈ మహత్తర ఘట్టం ఆవిష్కృతమైంది. వేదమంత్రోచ్చారణ మధ్య రామ్‌లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించారు. ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బాణం, స్వర్ణాభరణాలతో భక్తులకు దర్శనమిచ్చాడు బాలరాముడు. చిరు దరహాసం, ప్రసన్న వదనంతో ఉన్న ఆ చిన్ని రాముడి దర్శనంతో భారతావని పులకించిపోయింది. టీవీల్లో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చూసి అశేష భక్తకోటి తన్మయత్వం చెందింది. మంగళవారం నుంచి (జనవరి 23) నీల మేఘ శ్యాముడు భక్త జన కోటికి దర్శనం ఇవ్వనున్నారు.

దర్శనం కోసం:

అయోధ్య బాలరాముని దర్శనం కోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. దీనికోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం వెబ్ సైట్ https://online.srjbtkshetra.org లో మొబైల్ నంబర్ ద్వారా రిజిస్టర్ కావాలి. అందులో ఓటీపీ నమోదుచేసి.. ‘దర్శన్’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అందులో దర్శనం చేసుకునే తేదీ, టైం, దర్శనానికి వచ్చేవారి సంఖ్య, రాష్ట్రం తదితర వివరాలు ఎంటర్ చేసి అప్ లోడ్ చేయాలి. దీంతో ఆన్ లైన్ లో టికెట్ బుక్ అవుతుంది.

ఆఫ్ లైన్ లో టికెట్స్ బుక్ చేసుకునేవారు.. ఆలయం సమీపంలోని కౌంటర్ వద్దకు వెళ్లి, ప్రభుత్వం ధృవీకరించిన గుర్తింపు కార్డు చూపించి టికెట్స్ పొందొచ్చు. పదేళ్లకన్నా తక్కువ వయసున్న పిల్లలకు నో టికెట్. దర్శనం టికెట్లు తీసుకున్నాక.. 24 గంటల్లోపు టికెట్ క్యాన్సిల్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.

దర్శనం, హారతి టైమింగ్స్ ఇవే:

➤ ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 11:30 గంటల వరకు

➤ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 గంటల వరకు

➤ ప్రత్యేక సందర్భాలు, పండుగ వేళల్లో దర్శన సమయాల్లో మార్పులుంటాయి.

➤ ఉదయం 6 : 30 గంటలకు శృంగార్ హారతి

➤ మధ్యాహ్నం 12 గంటలకు భోగ్ హారతి

➤ సాయంత్రం 07:30 గంటకు సంధ్యా హారతి




Updated : 22 Jan 2024 10:45 AM GMT
Tags:    
Next Story
Share it
Top