దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలం.. భారీ ధరకు అమ్ముడైన..
X
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన ఆస్తుల వేలానికి భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ కిరాతకుడికి చెందిన నాలుగు ప్రాపర్టీలను వేలం వేయగా.. అందులోని రెండింటికి ఎవరూ పోటీపడలేదు. అయితే 15వేల బేస్ ప్రైస్‌తో వేలం వేసిన ఓ ప్లాట్‌కు రెండు కోట్లు రావడం గమనార్హం. మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలోని ముంబేకే గ్రామంలో ఉన్న భూములను ఇవాళ వేలం వేశారు. 1730 చదరపు మీటర్లు ఉన్న ఓ ప్లాట్‌పై బేస్ ప్రైస్ 1.56 లక్షలు కాగా.. ఆ ప్లాట్ 3.28 లక్షలకు అమ్ముడుపోయింది.
మరో ఫ్లాట్ 170.98 చదరపు మీటర్లు ఉండగా.. దాన్ని బేస్ ప్రైస్‌ను 15వేలుగా ఫిక్స్ చేశారు. అయితే ఆ ఫ్లాట్ రెండు కోట్లకు సేల్ అయ్యింది. అజయ్ శ్రీవాత్సవ్ అనే లాయర్ దీన్ని కొనుగోలు చేశారు. న్యూమరాలజీ ప్రకారం సర్వే నంబర్ తనకు అనుకూలంగా ఉందని అజయ్ తెలిపారు. ఈ ఫ్లాట్లో సనాతన్ పాఠశాలను ప్రారంభిస్తామని చెప్పారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్‌కు చెందిన మూడు ప్రాపర్టీలను గతంలో కూడా ఈయనే కొన్నారు. 2020లో కొన్న బంగ్లాలో సనాతన్ ధర్మ్ పాఠశాల ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు అజయ్ వివరించారు. కాగా 1976 నాటి స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్స్‌చేంజ్ మానిప్యులేటర్స్ యాక్టు కింద దావూద్ ఆస్తులను వేలం వేశారు.