Dawood Ibrahim : దావూద్ ఇబ్రహీంకు సీరియస్.. ఆస్పత్రిలో..
X
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తోంది. ఆయనపై విషప్రయోగం జరగడంతో ఆరోగ్యం క్షీణించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కరాచీ ఆసుపత్రిలో అతడు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అయితే పాక్ మాత్రం దీనిని అధికారికంగా ధృవీకరించలేదు. కానీ దావూద్కు సీరియస్గా ఉన్నట్లు పాక్ జీవి టీవీ పేర్కొంది. ఆస్పత్రిలోని దావూద్ ఇబ్రహీం చికిత్స పొందుతున్న ఫ్లోర్లో అతను ఒక్కడే రోగి ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రి చుట్టుపక్కల కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారని సమాచారం.
దావూద్ 1955లో మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో జన్మించాడు. ఆ తరువాత కుటుంబంతో సహా ముంబై వెళ్లాడు. 1970ల్లో ముంబై అండర్‌వరల్డ్‌లో అతడు అంచలంచెలుగా ఎదిగాడు. ఎన్నో దారుణాలకు పాల్పడ్డ అతడి గ్యాంగ్‌కు అప్పట్లో డీ-కంపెనీగా పేరుండేది. 1993లో ముంబై వరుస పేలుళ్లకు దావూదే మాస్టర్ మైండ్. ఇక 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో నిందుతులకు దావూద్ ఆయుధాలు అందేలా చేశాడనే ఆరోపణలున్నాయి. ఇక గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ లో దావూద్ ఉంటుండగా.. అక్కడి ప్రభుత్వం మాత్రం అదేం లేదంటూ కొట్టిపారేస్తుంది.