Home > జాతీయం > ఆప్ కీలక నిర్ణయం.. రాజ్యసభకు మహిళా కమిషన్ చైర్ పర్సన్..

ఆప్ కీలక నిర్ణయం.. రాజ్యసభకు మహిళా కమిషన్ చైర్ పర్సన్..

ఆప్ కీలక నిర్ణయం.. రాజ్యసభకు మహిళా కమిషన్ చైర్ పర్సన్..
X

ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మాలీవాల్ రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. అమ్మాయిలపై జరుగుతున్న ఆకృత్యాలపై నిత్యం ఆమె తన గళాన్ని వినిపించేది. ఈ క్రమంలోనే ఆమెను ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభకు పంపుతోంది. ఢిల్లీతో పాటు సిక్కింలో నాలుగు రాజ్యసభ స్థానాలకు జనవరి 19న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ముగ్గురు అభ్యర్థులను ఆప్ నామినేట్‌ చేసింది. ఇందులో స్వాతి మాలీవాల్‌ కూడా ఉన్నట్లు ఆప్ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ ప్రకటించింది.

ఢిల్లీలోని మూడు రాజ్యసభ స్థానాలకు ఆప్ నేతలు సంజయ్‌ సింగ్‌, సుశీల్‌ కుమార్‌ గుప్తా, నారాయణ్‌ దాస్‌ గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరి పదవీకాలం ఈ నెల 27తో ముగియనుంది. దీంతో ఈ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ క్రమంలోనే సంజయ్‌ సింగ్‌, నారాయణ్‌ దాస్‌ గుప్తాను వరుసగా రెండోసారి ఆప్ నామినేట్‌ చేసింది. అయితే సుశీల్‌ కుమార్‌ గుప్తా ఈ ఏడాది చివర్లో జరగనున్న హరియానా అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకోవడంతో ఆయన స్థానంలో స్వాతి మాలివాల్‌ను పార్టీ ఎంపిక చేసింది.

కాగా మనీలాండరింగ్‌ కేసులో సంజయ్‌ సింగ్‌ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. దీంతో నామినేషన్ దాఖలుపై ఆయన ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. రీనామినేషన్‌ పత్రాలపై సంతకం చేసేందుకు తనను అనుమతించేలా జైలు అధికారులను ఆదేశించాలని కోరగా.. కోర్టు ఆయన అభ్యర్థనను అంగీకరించింది. కోర్టు నిర్ణయంతో సంజయ్ సింగ్ కు భారీ ఊరట దక్కింది. ఇక నామినేషన్లకు ఈ నెల 9 చివరి తేదీ కాగా.. 19న ఎన్నికలు జరగనున్నాయి.

Updated : 5 Jan 2024 2:50 PM IST
Tags:    
Next Story
Share it
Top