Lawyer Sara Sunny : చెవిటి, మూగ లాయర్ ‘వాదించింది’.. సుప్రీం చరిత్రలో తొలిసారి
X
దేశ అత్యున్నత న్యాయస్థానంలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. సుప్రీం కోర్టులో తొలిసారిగా ఓ చెవిటి, మూగ న్యాయవాది వాదానలు వినిపించారు. సారా సన్నీ అనే యువ న్యాయవాది సైగలతో వాదించగా ఓ వ్యక్తి ఇంటర్‌ప్రెటర్(అనువాదకుడు)గా తర్జుమా చేశాడు.
సీజేఏ చంద్రచూడ్ బెంచ్ ముందు వర్చువల్ విధానంలో వాదనలు జరిగాయి. సంచిత ఆన్ అనే అడ్వొకేట్ ప్రతినిధిగా సన్నీ ఓ కేసులో వాదించారు. సుప్రీం కోర్టులో అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు కల్పించేందుకు జస్టిస్ చంద్రచూడ్ ప్రయత్నిస్తున్నారు. కోర్టులో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కరించాలని ఆయన గత ఏడాది సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇద్దరు దివ్యాంగ బాలికలను చంద్రచూడ్ దత్తత తీసుకున్నారు. సుప్రీం కోర్టు ఎలా పనిచేస్తోందో చూపడానికి వారిద్దరిని కోర్టుకు తీసుకొచ్చారు. బాలల హక్కులకు సంబంధించి సుప్రీం కోర్టు ఆదివారం అవగాహన కార్యక్రమంలోనూ తొలిసారి సైగల భాషను అనుమతించారు. కార్యక్రమ వివరాలు బ్రెయిలీ లిపిలో ముద్రించారు .