Home > జాతీయం > India-Canada: కెనడా, భారత్ మధ్య క్షీణించిన వాణిజ్య సంబంధాలు

India-Canada: కెనడా, భారత్ మధ్య క్షీణించిన వాణిజ్య సంబంధాలు

India-Canada: కెనడా, భారత్ మధ్య క్షీణించిన వాణిజ్య సంబంధాలు
X

భారత్- కెనడా మధ్య ఉద్రిక్తత అంతకంతకూ పెరుగుతోంది.రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. దీంతో ఇరు దేశాల దౌత్య సంబంధం దెబ్బతినే అవకాశం ఉంది. దీనికి కారణం లేకపోలేదు. మొదట భారత రాయబారిని కెనడా నుంచి వెనక్కి పంపగా.. ఆ తర్వాత భారత్ నుంచి కెనడా రాయబారిని వెనక్కి సాగనంపారు. అంతేకాకుండా కెనడా రాయబారి కామెరూన్ మెక్‌కే భారత్ పై సంచలన ఆరోపణలు చేశారు. కెనడాలో ఇటీవల జరిగిన ఖలిస్థాన్ తీవ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని అన్నారు. కొంతమంది భారతీయ ఏజెంట్లకు ఈ హత్యతో సంబంధముందని, దానికి సంబంధం ఉన్న వాళ్ల ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. ఈ అంశంపై దేశీయ భద్రతా సంస్థలు సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నాయని ట్రూడో వెల్లడించారు.

ఈ విషయంలో నిరాధార ఆరోపణలు చేసిన కెనడాకు భారత్ గట్టి జవాబు ఇచ్చింది. భారత్‌లో కెనడా హైకమిషనర్‌ అయిన కామెరూన్‌ మెక్‌కేకు కేంద్ర విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. ఉదయం ఆయన ఢిల్లీ సౌత్‌బ్లాక్‌లోని విదేశాంగ శాఖ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఈ క్రమంలోనే భారత్‌లోని సీనియర్‌ కెనడియన్‌ డిప్లొమాట్ను బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని విదేశాంగ శాఖ.. కెనడా హైకమిషనర్‌కు చెప్పింది. ఐదు రోజుల్లోగా ఆ దౌత్యవేత్త దేశాన్ని వీడి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. దేశ అంతర్గత వ్యవహారాల్లో కెనడా దౌత్యవేత్తల జోక్యం, భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా ఆ రాయబారిని బహిష్కరించామని విదేశాంగ శాఖ ప్రకటించింది. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సోమవారం ఆ దేశ పార్లమెంటులో అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ప్రకటన చేసిన కొన్ని గంటలకే కెనడాలో భారత రాయబారిని బహిష్కరిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించింది.

Updated : 19 Sept 2023 9:05 PM IST
Tags:    
Next Story
Share it
Top