Home > జాతీయం > G 20 Summit : గెస్టుల కోసం స్పెషల్ డిన్నర్ సెట్..దేంతో తయారు చేశారంటే..!

G 20 Summit : గెస్టుల కోసం స్పెషల్ డిన్నర్ సెట్..దేంతో తయారు చేశారంటే..!

G 20 Summit : గెస్టుల కోసం స్పెషల్ డిన్నర్ సెట్..దేంతో తయారు చేశారంటే..!
X

జీ - 20 శిఖరాగ్ర సదస్సుకు ఆతిధ్యమిస్తున్న భారత్ అందుకోసం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది. ఢిల్లీ వేదికగా ఈ నెల 9, 10 తేదీల్లో సమావేశాలు జరగనున్నాయి. ఈక్రమంలో సమ్మిట్కు హాజరయ్య అతిథులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గెస్టులకు స్వాగతం పలకడం మొదలు బస, వంటకాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అతిధుల గౌరవానికి తగ్గట్లుగా ఫుడ్ సర్వ్ చేసే విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఏర్పాట్లు చేశారు.

సమ్మిట్ కు హాజరయ్యే అతిధులు ఆతిథ్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేని విధంగా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. స్పెషల్ గెస్టులందరికీ బంగారు, వెండి పాత్రల్లో ఫుడ్ సర్వ్ చేయనున్నారు. అతిధుల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన డిన్నర్ సెట్‌లో వెండి వస్తువులు, బంగారు పూత పూసిన గిన్నెలు, ప్లేట్లు, స్పూన్లు ఉన్నాయి. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా వాటిని డిజైన్ చేశారు. దాదాపు 200 మంది కళాకారుల ఈ డిన్నర్ సెట్ రూపకల్పనలో పాలుపంచుకున్నారు. కర్నాటక, బెంగాల్, యూపీ, రాజస్థాన్, ఉత్తరాఖండ్ కు చెందిన కళాకారులు వీటిని తయారు చేశారు.

Updated : 6 Sep 2023 3:19 PM GMT
Tags:    
Next Story
Share it
Top