Home > జాతీయం > Delhi: గాల్లోనే నిలిచిపోయిన జెయింట్‌ వీల్‌.. గుండెలు గుభేల్

Delhi: గాల్లోనే నిలిచిపోయిన జెయింట్‌ వీల్‌.. గుండెలు గుభేల్

Delhi: గాల్లోనే నిలిచిపోయిన జెయింట్‌ వీల్‌.. గుండెలు గుభేల్
X

పండుగవేళ ఎంజాయ్ చేద్దామని నవరాత్రి మేళా (Navratri Mela) ఎగ్జిబిషన్‌కు వెళ్లిన కొందరికి చేదు అనుభవం ఎదురైంది. బుధవారం ఎగ్జిబిషన్ లోని జెయింట్ వీల్‌ (Giant Wheel) ఎక్కిన 20 మంది గాల్లోనే ఆగిపోయారు. నిన్న రాత్రి 10:30 గంటల ప్రాంతంలో టెక్నికల్ ప్రాబ్లెం కారణంగా ఆ జెయింట్ వీల్ అకస్మాత్తుగా నిలిచిపోయింది. వెంటనే పోలీసులు రంగంలోకి వారందరినీ సురక్షితంగా రక్షించారు. న్యూఢిల్లీ‌ (Delhi)లోని నరేలా ప్రాంతంలో జరిగిందీ సంఘటన.

దసరా పండుగ సందర్భంగా నరేలా ప్రాంతంలో నవరాత్రి మేళా జరుగుతోంది. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన జెయింట్ వీల్ ఎక్కిన 20 మందికి చుక్కలు కనిపించాయి. ఈ ఘటనపై ఢిల్లీ ఫైర్‌ సర్వీస్‌ డైరెక్టర్‌ అతుల్‌ గార్గ్‌ మాట్లాడుతూ.. బుధవారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో తమకు కాల్‌ వచ్చినట్లు చెప్పారు. నరేలా (Narela)లోని సుభాష్‌ రాంలీలా మైదాన్‌ (Ramlila Maidan)లో జరుగుతున్న నవరాత్రి మేళాలో సాంకేతిక సమస్యల కారణంగా జెయింట్‌ వీల్‌ మధ్యలో ఆగిపోయిందని చెప్పారు. అందులో నలుగురు పిల్లలు, 12 మంది మహిళలు, నలుగురు పురుషులు మొత్తం 20 మంది చిక్కుకుపోయినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే రెండు ఫైర్‌ టెండర్లు సంఘటనా స్థలానికి చేరుకొని జెయింట్‌ వీల్‌లో చిక్కుకున్న వారందరినీ సురక్షితంగా రక్షించినట్లు చెప్పారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు.

Updated : 19 Oct 2023 1:24 PM IST
Tags:    
Next Story
Share it
Top