గోవాకు కేజ్రీవాల్.. ఈడీ విచారణకు మళ్లీ డుమ్మా..
X
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ విచారణకు ఢిల్లీ సీఎం మరోసారి డుమ్మా కొట్టనున్నారు. గురువారం విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే కేజ్రీవాల్ మాత్రం విచారణకు వెళ్లొద్దని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ తో కలిసి ఆయన ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ నిర్వహించే లోక్ సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో పాల్గొంటారు. ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా కొట్టడం ఇది నాల్గోసారి.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతేడాది నవంబర్ 2న తొలిసారిగా సీఎం కేజ్రీవాల్‌కు నోటీసులు జారీచేసింది. అయితే ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో ఈడీ అధికారులు డిసెంబర్ 21న రెండోసారి నోటీసులు పంపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ఉందన్న కారణంతో 10 రోజులపాటు విపాసన మెడిటేషన్ క్యాంప్‌నకు వెళ్లారు. ఈ క్రమంలో జనవరి 3న విచారణకు రావాలంటూ ఆప్ అధినేతకు మూడోసారి నోటీసులు పంపించింది. అయితే దానికి కూడా సీఎం కేజ్రీవాల్ దూరంగా ఉన్నారు. తాజాగా జనవరి 18న రావాలని తాఖీదులు ఇవ్వగా.. ఈసారి కూడా విచారణకు డుమ్మాకొట్టి గోవాకు వెళ్తున్నారు. ఈడీ నోటీసులపై చట్టం ప్రకారం నడుచుకుంటానని కేజ్రీవాల్ ఇప్పటికే స్పష్టం చేశారు.