Home > జాతీయం > Kejriwal : మీ భ‌ర్త‌లు మోదీ జ‌పం చేస్తే.. వారికి భోజనం పెట్టొద్దు సీఎం కేజ్రీవాల్ కామెంట్స్

Kejriwal : మీ భ‌ర్త‌లు మోదీ జ‌పం చేస్తే.. వారికి భోజనం పెట్టొద్దు సీఎం కేజ్రీవాల్ కామెంట్స్

Kejriwal  : మీ భ‌ర్త‌లు మోదీ జ‌పం చేస్తే.. వారికి భోజనం పెట్టొద్దు సీఎం కేజ్రీవాల్ కామెంట్స్
X

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అనేక మంది పురుషులు ఈ మధ్య మోదీ పేరు జపం చేస్తున్నారని అలాంటి వారికి రాత్రి భోజనం పెట్టొద్దని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన మహిళా సమ్మన్ సమరోహ్ కార్యక్రమంలో మాట్లడారు. ప్రతి కుటుంబ సభ్యులు ఆప్‌కు ఓటేసేలా మీ మీద వారితో ఒట్టు వేయించుకోండి అని ఆయన అన్నారు. బీజేపీకి మద్దతు ఇస్తున్న మహిళలకు మీ సోదరుడు కేజ్రీవాల్ గురించి చెప్పండి .నేను వాళ్లకు ఎప్పటికీ అండగా ఉంటానని వివరించండి’’ అని మహిళలకు కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. 2024-25 బ‌డ్జెట్‌లో మ‌హిళల‌కు నూతన పధకం ప్ర‌వేశ‌పెట్టామ‌ని తెలిపారు. 18 ఏండ్లు నిండిన ప్ర‌తి యువ‌తికి, మ‌హిళ‌కు నెల‌కు రూ. 1000 చొప్పున ఇస్తున్నామ‌ని చెప్పారు. ఫ్రీ క‌రెంట్ ఇస్తున్నాం. బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం క‌ల్పించాం.

వీటితో పాటు ఇప్పుడు నెల‌కు రూ. 1000 ఇవ్వ‌బోతున్నాం. మ‌రి మీకు బీజేపీ ఏం చేసింది..? అస‌లు బీజేపీకి ఎందుకు ఓటేయాలి..? ఈ సారి కూడా కేజ్రీవాల్‌కు ఓటేయాలి. ఢిల్లీ ప్ర‌జ‌ల‌కు మీ అన్న కేజ్రీవాల్ అండ‌గా ఉంటారు త‌ప్ప‌.. ఇత‌రులు ఎవ‌రూ ఉండ‌ర‌ని కేజ్రీవాల్ పేర్కొన్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కేజ్రీవాల్‌కు ఓటేస్తామ‌ని ప్ర‌తి మ‌హిళ త‌మ ఇంట్లో ప్ర‌తిజ్ఞ చేయించాలి. అంతేకాకుండా ఆప్ ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని ఆయ‌న కోరారు. మహిళలు రాజకీయల్లోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. మహిళలకు అధికారం వద్దని నేను అనట్లేదు. వాళ్లకు పెద్ద పోస్టులు, టిక్కెట్స్ రావాల్సిందే. వాళ్లకు అన్నీ అందాలి. అయితే, ఇద్దరో నలుగురో మహిళలు ఈ ప్రయోజనాలు పొందితే మిగతా వారి పరిస్థితి ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు. తమ కొత్త పథకం ‘ముఖ్యమంత్రి మహిళా యోజన సమ్మాన్‌’తోనే మహిళలకు నిజమైన సాధికారత వస్తుందని ఆయన అన్నారు.




Updated : 10 March 2024 12:57 PM IST
Tags:    
Next Story
Share it
Top