Home > జాతీయం > రాహుల్ గాంధీకి థ్యాంక్స్ చెప్పిన కేజ్రీవాల్.. ఎందుకంటే..?

రాహుల్ గాంధీకి థ్యాంక్స్ చెప్పిన కేజ్రీవాల్.. ఎందుకంటే..?

రాహుల్ గాంధీకి థ్యాంక్స్ చెప్పిన కేజ్రీవాల్.. ఎందుకంటే..?
X

రాహుల్ గాంధీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ థ్యాంక్స్ చెప్పారు. పార్లమెంట్లో ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసినందుకు రాహుల్, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు కేజ్రీవాల్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ రాశారు. ‘‘ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసినందుకు ధన్యవాదాలు. కాంగ్రెస్ మద్ధతుకు ఢిల్లీ ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ లెటర్ రాస్తున్నా. ఢిల్లీ ప్రజల హక్కుల కోసం పార్లమెంట్లో మీరు ఎంతో పోరాడారు. రాజ్యాంగాన్ని అణదొక్కేవారి వారికి వ్యతిరేకంగా మేం చేసే పోరాటానికి మీ మద్ధతు కోరుతున్నాం’’ అని కేజ్రీవాల్ లేఖ రాశారు.

కాగా ఢిల్లీ సర్కార్ అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్రం ఈ ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది. ఢిల్లీలో పోలీసు, పబ్లిక్ ఆర్డర్, భూమి మినహా సేవల నియంత్రణను ఆప్ ప్రభుత్వానికి అప్పగిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వారం తర్వాత కేంద్రం ఈ ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. ఈ ఆర్డినెన్స్ బిల్లుకు లోక్ సభ, రాజ్యసభ ఆమోదం తెలిపాయి. రాష్ట్రపతి ఆమోదంతో ఇది చట్టరూపం దాల్చనుంది. దీంతో దేశరాజధానిలో పాలనాధికారాలు లెఫ్ట్నెంట్ గవర్నర్ చేతుల్లోకి రానున్నాయి. అయితే మొదటి నుంచి ఈ బిల్లును ఆప్ సర్కార్ వ్యతిరేకిస్తూనే ఉంది.

Updated : 9 Aug 2023 4:27 PM IST
Tags:    
Next Story
Share it
Top