Home > జాతీయం > రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసు...బ్రిజ్ భూషణ్ సింగ్‌కు సమన్లు

రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసు...బ్రిజ్ భూషణ్ సింగ్‌కు సమన్లు

రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసు...బ్రిజ్ భూషణ్ సింగ్‌కు సమన్లు
X

మహిళా రెజ్లర్లు లైంగిక ఆరోపణలు కేసులో బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌కు ఢిల్లీలోని కోర్టు సమన్లు జారీ చేసింది. బ్రిజ్ భూషణ్‎తో పాటు అతడి సహాయ కార్యదర్శి వినోద్ తోమర్‌కు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. జూలై 18న కోర్టుకు హాజరుకావాలని కోరింది. నిందితులపై విచారణకు తగిన సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొంది.

బ్రిజ్ భూషణ్ సింగ్‌ తమను లైంగిక వేధిస్తున్నాడంటూ పలువురు ప్రముఖ రెజ్లర్లు గత కొద్ది రోజులుగా ఆరోపిస్తు..ఆందోళనలు చేస్తున్నారు. ఈ మేరకు జూన్ 2న, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణల ఆధారంగా ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు, 10 ఫిర్యాదులు నమోదు చేశారు. ఈ కేసులో చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుని సమన్లు జారీ చేశారు. డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌పై వచ్చిన ఫిర్యాదులలో ఆయన అనుచితంగా తాకడం, అమ్మాయిల ఛాతీపై చేయి వేయడం, ఛాతీ నుంచి వెనుకకు తన చేతిని తరలించడం, వారిని వెంబడించడం వంటి చర్యలను పేర్కొన్నారు.కోర్టు నోటీసులపై బ్రిజ్ భూషన్ స్పందించారు. జూలై 18న కోర్టు ముందు హాజరవుతున్నట్లు తెలిపారు. కోర్టుకు హాజరుకాకుండా తనకి ఎలాంటి మినహాయింపు అవసరం లేదని తెలిపారు.


Updated : 7 July 2023 4:19 PM IST
Tags:    
Next Story
Share it
Top