ప్రభుత్వ ఆదేశం.. నవంబర్ 10 వరకు స్కూళ్లు బంద్
Bharath | 5 Nov 2023 12:07 PM IST
X
X
ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో గాలి నాణ్యత సూచిక తీవ్ర స్థాయికి పడిపోవడంతో ఆప్ ప్రభుత్వం అక్కడి ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ఈ క్రమంలో మొదట నవంబర్ 3, 4 తేదీల్లో సెలవులు ప్రకటించగా.. కాలుష్య స్థాయి ఎక్కువ ఉండటంతో సెలవులను నవంబర్ 10 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. 6 నుంచి 12 తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి తెలిపారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. రాబోయే రెండు, మూడు రోజుల వరకు గాలి నాణ్యత క్షీణించి ఉండే చాన్స్ ఉన్నందున సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. ఢిల్లీ, పరిసర ప్రాంతాలలో గతకొన్ని రోజులుగా గాలి నాణ్యత తీవ్రంగా ఉంది. సీపీసీబీ డేటా ప్రకారం, ఇవాళ ఉదయం ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక 400-మార్క్ కంటే ఎక్కువగా నమోదైంది. ఇది తీవ్రమైన కేటగిరీ కిందకు వస్తుంది.
Updated : 5 Nov 2023 12:07 PM IST
Tags: Delhi Delhi govt aap govt deteriorating air quality air quality air pollution holidays for schools kejriwal
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire