Home > జాతీయం > ఈసీ నోటీసులపై స్పందించని రాహుల్.. చర్యలు తీసుకోమన్న ఢిల్లీ హైకోర్టు

ఈసీ నోటీసులపై స్పందించని రాహుల్.. చర్యలు తీసుకోమన్న ఢిల్లీ హైకోర్టు

ఈసీ నోటీసులపై స్పందించని రాహుల్.. చర్యలు తీసుకోమన్న ఢిల్లీ హైకోర్టు
X

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ప్రధాని మోడీపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. పిక్ పాకెటర్స్ అనే పదాన్ని ఉపయోగించడంపై 8 వారాల్లోగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిల్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

వాస్తవానికి పిక్ పాకెటర్స్ కేసుకు సంబంధించి ఇప్పటికే విచారణ ప్రారంభించిన ఎలక్షన్ కమిషన్ నవంబర్‌ 23న రాహుల్ గాంధీకి నోటీసులు ఇచ్చింది. నవంబర్ 26లోపు సమాధానం ఇవ్వాలని లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని నోటీసులు జారీ చేసింది. అయితే రాహుల్‌ గాంధీ నోటీసులపై స్పందించకపోవడంతో కోర్టు ఆయనపై చర్యలకు ఆదేశించింది. అయితే ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది మాత్రం కోర్టు స్పష్టం చేయలేదు.

నవంబరు 22న ఓ ఎన్నికల ర్యాలీలో రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. ప్రధానిపై పనౌతీ, పిక్‌ పాకెట్‌ వంటి అనుచిత పదాలు ఉపయోగించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే రాహుల్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది.

Updated : 21 Dec 2023 2:45 PM GMT
Tags:    
Next Story
Share it
Top