Home > జాతీయం > జైల్లో నన్ను చంపేస్తారు, మార్చండి.. ఢిల్లీ లిక్కర్ నిందితుడు

జైల్లో నన్ను చంపేస్తారు, మార్చండి.. ఢిల్లీ లిక్కర్ నిందితుడు

జైల్లో నన్ను చంపేస్తారు, మార్చండి.. ఢిల్లీ లిక్కర్ నిందితుడు
X

కోట్లాది రూపాయల స్కామ్‌లు నడిపి, హీరోయిన్లతో రొమాన్స్ చేసి ప్రస్తుతం తీహర్ జైల్లో చిప్పకూడు తింటున్న మోసగాడు సుఖేశ్ చంద్రశేఖర్ మళ్లీ లేఖ సంధించాడు. తనను, తన భార్య లీనాను జైల్లోనే ఖతం చేసేందుకు కుట్ర జరుగుతోందని, తమను మరో జైలుకు మార్చాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు సుఖేశ్ చంద్రశేఖర్ లేఖ రాశాడు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సక్సేనా జైల్లో ఉంటున్నాడు. మరిన్ని ఆర్థిక నేరాల కేసులు కూడా అతనిపై ఉన్నాయి. అతని భార్య లీనా కూడా ఫ్రాడ్ కేసులో జైల్లో ఉంది.

‘‘సీఎం కేజ్రీవాల్, మాజీ మంత్రి సత్యేందర్ జైన్ తదితరులపై నేను చేసిన ఫిర్యాదులను, ఇచ్చిన సాక్ష్యాలను వాపసు తీసుకోవాలని బెదిరిస్తున్నారు. నా లాయర్ అనంత్‌ మాలిక్‌కు, మా అమ్మకు ఫోన్ చేస్తున్నారు. జైలు తమ అజమాయిషీలోనే ఉందని, భోజనంలో విషం కలిపి చంపేస్తామంటున్నారు. కేజ్రీవాల్ కుడి భుజం మనోజ్ మా అమ్మను బెదిరించాడు. సత్యేందర్ భార్య పూనమ్ కూడా బెదించింది. నా ఫోన్ డేటాను ఇవ్వాలని బెదిరిస్తున్నారు. ఢిల్లీ జైల్లో నాకు ప్రాణహాని ఉంది’’ అని సుఖేశ్ తెలిపాడు. తన న్యాయవాదికి వచ్చిన బెదిరింపు కాల్స్ అంటూ కొన్ని వివరాలను కూడా ఎల్జీకి పంపాడు. బెంగళూరుకు చెందిన సుఖేశ్, అతని లీనా పలు ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు ఉన్నాయి. హైప్రొఫైల్ నేరగాళ్లను వీరు బురిడీ కొట్టించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంతోనూ అతనికి సంబంధముంది. బీఆర్ఎస్ నేతలతో తనే నేరుగా డీల్ చేశానని చెబుతున్నాడు. హీరోయిన్లు జాక్విలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహా అతనికి చాలా క్లోజ్ అనే అరోపణలు ఉన్నాయి.

Updated : 9 July 2023 5:38 PM IST
Tags:    
Next Story
Share it
Top