Home > జాతీయం > మొదటి రోజే ఉద్యోగానికి రాజీనామా...కారణం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

మొదటి రోజే ఉద్యోగానికి రాజీనామా...కారణం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

మొదటి రోజే ఉద్యోగానికి రాజీనామా...కారణం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
X

ఇటీవల కాలంలో కొంతమంది తమ ఉద్యోగ అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. వారి కార్యాలయంలో వారు ఎదుర్కొనే సవాళ్లతో సహా, లే ఆఫ్స్ వంటి విషయాలను వివరిస్తున్నారు. వీటిలో కొన్ని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఢిల్లీకి చెందిన ఉద్యోగి చేసిన పోస్ట్ ప్రస్తుతం హాట్ టాపిక్‎గా మారింది. ఉద్యోగి జాయిన్ అయిన మొదటి రోజే

తన తొలి ఉద్యోగానికి రాజీనామా చేశాడు.

ఢిల్లీలోని వాయువ్య ప్రాంతానికి చెందిన యువకుడికి ఇటీవల మంచి ఉద్యోగం వచ్చింది. కంపెనీ అందిస్తానన్న జీతంతో కూడా సంతోషంగా ఉన్నాడు. ఇక ఎంతో ఉత్సాహంగా మొదటి రోజు

గురుగ్రామ్ లో ఉన్న ఆఫీస్ కు వెళ్లాడు. అయితే అతడు తొలి రోజే రాజీనామా చేసినట్టు రెడిట్ పోస్ట్ ద్వారా తెలిపాడు. ఉద్యోగం వదులుకోవడానికి ఆ యువకుడు చెప్పిన కారణం ఆశ్చర్యానికి గురిచేసింది.

అధిక ట్రాఫిక్ కారణంగా ఆ వ్యక్తి తన ఉద్యోగాన్ని వదులుకున్నట్లు రెడిట్ పోస్టులో పంచుకున్నాడు. "నేను మంచి జీతంతో ఒక ప్రముఖ కంపెనీలో ఉద్యోగం సంపాదించాను. అనేక రౌండ్ల ఇంటర్వ్యూలను ఎదుర్కొని జాబ్ సాధించాను. మొదటి ఉద్యోగం కావడంతో చాలా థ్రిల్ గా ఫీల్ అయ్యా. కానీ ప్రయాణం వల్ల ఎదురయ్యే సవాళ్లను అధిగమించలేకపోయాను. అక్కడ ఉద్యోగం చేస్తే ఇంట్లో మూడు గంటలు మాత్రమే ఉంటాను. ఛార్జీలు కూడా అదనమయ్యాయి. ప్రస్తుతం నేను ఉన్న పొజిషన్ లో కంపెనీ వద్దకు ఇళ్లు మారే అవకాశం లేదు. అందుకు మొదటి రోజే రాజీనామా చేశా" అని రాసుకొచ్చాడు.

దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు అతని నిర్ణయాన్ని తొందరపాటు చర్యగా పేర్కొన్నారు. చాలా మంది దూరంగా ప్రయాణించి ఉద్యోగాలు చేస్తున్నట్టు తెలిపారు. పలువురు సూచనలు అనంతరం అతడు మాట్లాడుతూ.. చాలా మంది సుదూరం ప్రయాణించి ఉద్యోగాలు చేస్తున్నట్టు తెలిసింది, ఎవ్వరితో మాట్లాడకుండా తాను హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నాను అని తెలిపాడు. నేను దీని నుండి నేర్చుకుంటాను, భవిష్యత్తులో నాకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటానని వివరించాడు.

Updated : 10 Aug 2023 3:18 PM IST
Tags:    
Next Story
Share it
Top