Home > జాతీయం > బ్రిజ్ భూష‌ణ్ కేసులో ట్విస్ట్.. పోక్సో కేసు రద్దుకు పోలీసుల నివేదిక

బ్రిజ్ భూష‌ణ్ కేసులో ట్విస్ట్.. పోక్సో కేసు రద్దుకు పోలీసుల నివేదిక

బ్రిజ్ భూష‌ణ్ కేసులో ట్విస్ట్.. పోక్సో కేసు రద్దుకు పోలీసుల నివేదిక
X

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్కు భారీ ఊరట దక్కింది. మైనర్ను లైంగికంగా వేధించినట్లు సాక్ష్యాలు లేవని కోర్టుకు తెలిపింది. ఈ కేసులో 1000 పేజీలతో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అదేవిధంగా పోక్సో కేసును తొలగించాలని కోరుతూ పాటియాలా హౌస్ కోర్టుకు 500 పేజీల నివేదికను కూడా సమర్పించారు. మైనర్ తండ్రి, బాధితురాలి వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు ఈ నివేదికను కోర్టుకు సమర్పించారు.

బ్రిజ్భూషణ్పై చేసిన ఆరోపణలను మైనర్ రెజ్లర్‌ ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. మేజిస్ట్రేట్ ముందు ఇచ్చిన మొదటి వాంగ్మూలంలో బ్రిజ్ భూషణ్ పై మైనర్ లైంగిక ఆరోపణలు చేసింది. రెండో స్టేట్‌మెంట్‌లో ఆ ఆరోపణలను ఉపసంహరించుకుంది. తనను ఎంపిక చేయలేదనే కోపంలో లైంగిక వేధింపుల కేసు నమోదు చేశానని చెప్పింది.

బ్రిజ్‌ భూషణ్‌ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని స్టార్ రెజ్లర్లు ఆందోళన బాటపట్టారు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ హామీతో కొంతకాలం పాటు నిరససకు బ్రేక్ ఇచ్చారు. కాగా ఏడుగురు మహిళా రెజర్లు ఆయనపై ఫిర్యాదులు చేయడంతో ఢిల్లీలోని కన్నౌట్‌ ప్యాలెస్‌ పోలీసు స్టేషన్‌లో ఏప్రిల్‌ నెలలో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఆరుగురు మహిళా రెజర్లతో తొలి ఎఫ్‌ఐఆర్‌.. మైనర్‌ రెజ్లర్‌ తండ్రి ఫిర్యాదుతో రెండో ఎఫ్‌ఐఆర్‌ను ఏప్రిల్‌ 28న నమోదు చేశారు.

Updated : 15 Jun 2023 10:52 AM GMT
Tags:    
Next Story
Share it
Top