కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం...తృటిలో తప్పించుకున్న విద్యార్థులు
X
ఢిల్లీలోని ఓ కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే బయటకు పరుగులు తీశారు. కొంతమంది విద్యార్థులు కిటికీల ద్వారా బయట పడ్డారు. ప్రమాదకర స్థితిలో మూడో ఫ్లోర్ నుంచి వైర్ల సాయంతో కిందకు దిగారు. ఈ సమయంలో పలువురు విద్యార్థులు అదుపుతప్పి కిందకు పడినట్లు వైరల్ అయిన వీడియోలో కనిపిస్తోంది.
11 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చి.. విద్యార్థులను కాపాడారు.ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు గాయపడగా..మిగిలిన వారు సురక్షితంగా బయటపడ్డారు. ముఖర్జీ నగర్ ప్రాంతంలోని ఈ ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
दिल्ली के मुखर्जी नगर में स्थित कोचिंग सेंटर में लगी भीषण आग, रस्सी के सहारे नीचे उतरे छात्र। #Delhi pic.twitter.com/BidpQZWV0J
— Versha Singh (@Vershasingh26) June 15, 2023