Home > జాతీయం > రష్యాలో ఎయిరిండియా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

రష్యాలో ఎయిరిండియా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

రష్యాలో ఎయిరిండియా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
X

ఎయిరిండియా విమానం రష్యాలో అత్యవసరంగా ల్యాండైంది. ఢిల్లీ నుంచి శాన్‌ ఫ్రాన్సిస్కో బయలుదేరిన AI173 ఫ్లైట్లో సాంకేతిక లోపం తలెత్తింది. ఇంజన్‌లో సమస్య కారణంగా రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండ్‌ చేశారు.ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 216 మంది ప్యాసింజర్లు, 16 మంది ఎయిరిండియా సిబ్బంది ఉన్నారు.

ఇంజన్‌లో సాంకేతిక లోపంతో ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్లాల్సిన విమానాన్ని దారి మళ్లించినట్లు ఎయిరిండియా ప్రతినిధి స్పష్టం చేశారు. రష్యా మగడాన్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ సురక్షితంగానే ల్యాండైనట్లు చెప్పారు. ప్యాసింజర్లను ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు ప్రకటించారు. వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే రిజర్వ్ ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ కు ఎయిరిండియాకు అనుమతించేందుకు రష్యా ఏవియేషన్ అథారిటీ ముందుకొచ్చింది.

ఇదిలా ఉంటే AI173 ఫ్లైట్లో సాంకేతిక సమస్య కారణంగా ఇబ్బంది ఎదుర్కొంటున్న ప్రయాణికుల కోసం ప్రత్యేక విమానం పంపనున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. జూన్ 7న ఈ విమానం మగడాన్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు బయలుదేరుతుందని చెప్పింది.

Updated : 6 Jun 2023 10:00 PM IST
Tags:    
Next Story
Share it
Top