Home > జాతీయం > పొగమంచు ఎఫెక్ట్.. డీజీసీఏ కొత్త మార్గదర్శకాలు జారీ..

పొగమంచు ఎఫెక్ట్.. డీజీసీఏ కొత్త మార్గదర్శకాలు జారీ..

పొగమంచు ఎఫెక్ట్.. డీజీసీఏ కొత్త మార్గదర్శకాలు జారీ..
X

దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కమ్ముకుంటున్న దట్టమైన పొగమంచు విమానాల రాకపోకలపై ప్రభావం చూపుతున్నాయి. కొన్ని విమానాలు ఆలస్యమైతే.. మరికొన్ని రద్దువుతున్నాయి. ఈ క్రమంలో ఫ్లైట్ సిబ్బంది, ప్యాసింజర్ల మధ్య వాగ్వాదాలు, దాడులు జరుగుతున్నాయి. ఆదివారం ఢిల్లీ నుంచి గోవా వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్ దాదాపు 12 గంటలు ఆలస్యం కావడంతో ఓ ప్రయాణీకుడు పైలెట్పై దాడి చేశాడు. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్.. డీజీసీఏ రంగంలోకి దిగింది. విమాన సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేసింది.

డీజీసీఏ తాజా మార్గదర్శకాల్లో ఫ్లైట్ల ఆలస్ం, రద్దుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్యాసింజర్లకు అందించాలని విమానయాన సంస్ధల్ని ఆదేశించింది. 3 గంటలకు మించి విమానాలు ఆలస్యమైతే వాటిని రద్దు చేసుకునేందుకు ఆయా ఎయిర్ లైన్స్కు వీలు కల్పించింది. ఈ నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయని డీజీసీఏ స్పష్టం చేసింది.

ఎయిర్ లైన్స్ కంపెనీలు తమ ఫ్లైట్ల ఆలస్యానికి సంబంధించి రియల్ టైం ఇన్ఫర్మేషన్ వెల్లడించాలని డీజీసీఏ తాజా ఎస్ఓపీలో ఆదేశించింది. విమానాల ఆలస్యం, రద్దుకు సంబంధించిన సమాచారాన్ని ఎయిర్ లైన్స్ వెబ్ సైట్లో పొందుపరచడంతో పాటు సదరు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న ప్యాసింజర్లకు మెసేజ్, వాట్సాప్ లేదా ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇవ్వాలని చెప్పింది. ఎయిర్ పోర్టుల్లో వేచి ఉన్న ప్రయాణికులకు విమాన ఆలస్యానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేయాలని డీజీసీఏ స్పష్టం చేసింది.

Updated : 15 Jan 2024 9:43 PM IST
Tags:    
Next Story
Share it
Top