Home > జాతీయం > సనాతన ధర్మంపై వెనక్కి తగ్గిన సీఎం స్టాలిన్

సనాతన ధర్మంపై వెనక్కి తగ్గిన సీఎం స్టాలిన్

సనాతన ధర్మంపై వెనక్కి తగ్గిన సీఎం స్టాలిన్
X

సనాతన ధర్మంపై తమళ నటుడు, ఈ రాష్ట్ర సీఎం కొడుకు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. నా కొడుకు ఉదయనిధి స్టాలిన్‎ను కొందరు టార్గెట్ చేశారని, వారిలో దేశ ప్రధాన మోదీ కూడా చేరిపోయారని ఈ మధ్యనే ఈ విషయంపై డీఎంకే చీఫ్ స్టాలిన్ స్పందించారు. తాజాగా ఈ వివాదంపై మరోసారి సీఎం రియాక్ట్ అయ్యారు. పార్టీ నేతలు సనాతన ధర్మంపై మాట్లాడకూడదంటూ కీలక సూచనలు చేశారు. సనాతన ధర్మం వివాదాన్ని కేంద్రం ఓ అస్త్రంగా మార్చుకుంటుందని , అందుకే పార్టీ నాయకులు కేంద్రం వైఫల్యాలపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.

" సనాతన ధర్మంపైనే ఎక్కువగా మాట్లాడటానికి సెంట్రల్ మినిస్టర్లు తెగ ట్రై చేస్తున్నారు. దీని గురించి మాట్లాడి తమ లోపాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల దృష్టిని మర్చాలని చూస్తున్నారు. ప్రధాని మోదీ కూడా సనాతన ధర్మం అంశంపై పోరాడాలని కేంద్ర మంత్రులకు సూచించడం వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం ఇదే. అందుకే నాయకులు ఆ విషయాన్ని గమనించి సనాతన ధర్మం అంశానికి దూరంగా ఉండండి. మతపరమైన బీజేపీ పాలనను అంతం చేసేందుకు అందరూ నడుం బిగించండి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో లోపాలపై స్పందించండి. దేశంలో ప్రజస్వామ్యాన్ని, హక్కులను కాపాడండి. 2024 అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. రాజకీయ పార్టీలు తన వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఈ క్రమంలో మతపరమైన వ్యాఖ్యలకు దూరంగా ఉండాలి" అంటూ పార్టీ శ్రేణులకు స్టాలిన్ కీలక సూచనలు చేశారు.

Updated : 14 Sep 2023 7:42 AM GMT
Tags:    
Next Story
Share it
Top