Home > జాతీయం > పంటపొలాల్లో కుప్పకూలిన డ్రోన్..

పంటపొలాల్లో కుప్పకూలిన డ్రోన్..

పంటపొలాల్లో కుప్పకూలిన డ్రోన్..
X

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలెప్మెంట్ ఆర్గనైజేషన్ (DRD0) కు చెందిన ఓ డ్రోన్ కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఆదివారం కుప్పకూలింది. ట్రయల్‌ రన్ విఫలమవడంతో హరియూర్ తాలుకాలోని వడ్డికెరె గ్రామంలో పడిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

చిత్రదుర్గ సమీపంలో డీఆర్‌డీవో ఓ టెస్ట్‌ రేంజ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. గత కొంతకాలంగా యూఏవీల అభివృద్ధిపై పరిశోధనలు చేస్తోంది. తపస్ పేరుతో రూపొందిస్తున్న ఈ డ్రోన్‌ను పరీక్షిస్తుండగా పెద్ద శబ్దంతో పంటపొల్లాలో కూలింది. డ్రోన్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున స్థానికులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఏం జరిగిందోనని ఆరా తీశారు. కొందరు ఘటనాస్థలంలో తీసిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతున్నాయి. డ్రోన్‌ కూలిన ప్రాంతానికి డీఆర్‌డీవో అధికారులు వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు సేకరించి రక్షణ శాఖకు సమగ్ర నివేదిక ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Updated : 20 Aug 2023 3:47 PM IST
Tags:    
Next Story
Share it
Top