ఫుల్‌గా తాగాడు...రోడ్డు మీద ఎత్తైన బోర్డు ఎక్కి పుషప్‌లు... వీడియో వైరల్
X
తాగుబోతులు రకరకాలుగా ఉంటారు. పూటుగా మద్యం సేవించి తిన్నగా ఇంటికి వెళ్లిపోయేవారు కొందరైతే..మరికొందరు మాత్రం మద్యం మత్తులో చిత్ర విచిత్ర వేషాలు వేస్తారు. పబ్లిక్‌లోనే విన్యాసాలు చేస్తారు. ఇలాంటి వీడియోలు ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో తాగుబోతు చేష్టలు ఎట్రాక్ట్ చేస్తున్నాయి.
ఫుల్‌గా మద్యం సేవించిన యువకుడు నడిరోడ్డుపై హల్చల్ చేశాడు. రహదారిపై 15 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన ఓ సైన్ బోర్డుపైకి ఎక్కి హంగామా సృష్టించాడు. ఎవరికీ అందనంత ఎత్తులో ఎక్సర్ సైజ్ చేశాడు. కాసేపు పుషప్స్ కొట్టి...తర్వాత కొత్త కొత్త భంగిమలు వేసి అందిరి దృష్టి తన వైపు తిప్పుకున్నాడు. అతడిని చూసి స్థానికులు, వాహనదారులు కాస్త ఆందోళనకు గురయ్యారు. ఎక్కడ పై నుంచి పడిపోతాడేమో అని కంగారపడ్డారు. ఒడిశాలోని సంబల్ పూర్లో ఇది జరిగింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. కింద ఉన్న వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.