Home > జాతీయం > ఇందిరాగాంధీ చివరి క్షణాలను వివరించిన డాక్టర్..ఆ రోజు ఏం జరిగిందంటే..?

ఇందిరాగాంధీ చివరి క్షణాలను వివరించిన డాక్టర్..ఆ రోజు ఏం జరిగిందంటే..?

ఇందిరాగాంధీ చివరి క్షణాలను వివరించిన డాక్టర్..ఆ రోజు ఏం జరిగిందంటే..?
X

1984 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి దేశ ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీని.. తన భద్రతా సిబ్బంది అక్టోబర్ 31న హత్య చేశారు. సిక్కు మతస్థులతో జరిగిన వివాదం వల్ల ఈ హత్య చేసినట్లు హంతకులు సత్వంత్‌ సింగ్, బియాంత్ సింగ్ ఒప్పుకున్నారు. ఇందిరా గాంధీపై 30 రౌండ్ల కాల్పులు జరిపాక.. రక్తపు మడుగులో పడిపోయిన ఆవిడను ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. ఆ టైంలో ఇందిరాకు చికిత్స అందించే ప్రయత్నం చేసి డాక్టర్, అప్పటి కార్డియాలజీ విభాగాధిపతి పి. వేణుగోపాల్.. ఇందిరా గాంధీ చివరి క్షణాల గురించి వివరించారు. ఆయన రాసిన ‘హార్ట్‌ఫెల్ట్‌: ఏ కార్డియాక్‌ సర్జన్స్‌ పయనీరింగ్‌ జర్నీ’పుస్తకంలో ఈ విషయాలను వివరించారు.

‘ఒంటి నిండా బులెట్ తూట్లతో.. కడుపులో నుంచి ఉబికి వస్తున్న రక్తంతో హాస్పిటల్ బెడ్ పై పడి ఉన్న ఇందిరా గాంధీని చూసి వణికిపోయా. ఆమెను కాపాడటానికి డాక్టర్లు, సర్జన్లు, నర్సులు ఎంతగానో శ్రమించారు. దాదాపు నాలుగు గంటలు కష్టపడ్డాం. ఓ వైపు రాజకీయ నేతలంతా హాస్పిటల్ చేరి తర్వాత పీఎం ఎవర్ని చేయాలనే చర్చలు జరుగుతున్నాయి. మొదట రక్త స్రావాన్ని ఆపాలని నిర్ణయించుకున్నాం. మొదట బైపాస్ చేయాలని ప్రయత్నించాం. కానీ, కాపాడలేకపోయాం. ఆవిడ చనిపోయిన విషయాన్ని రాజీవ్ గాంధీకి చెప్పడానికి బయటికి వచ్చినప్పుడు నోటి మాట రాలేద’ని వేణుగోపాల్ పుస్తకంలో వివరించారు.

Updated : 12 July 2023 8:55 AM GMT
Tags:    
Next Story
Share it
Top