Home > జాతీయం > షిమ్లాలో ఖాళీ లేదు.. మనాలి నిండిపోయింది.. రోడ్లపైనే అంతా

షిమ్లాలో ఖాళీ లేదు.. మనాలి నిండిపోయింది.. రోడ్లపైనే అంతా

షిమ్లాలో ఖాళీ లేదు.. మనాలి నిండిపోయింది.. రోడ్లపైనే అంతా
X

లాంగ్ వీకెండ్.. పైగా క్రిస్మస్ హాలిడే.. ఇక ఎవరు ఊరుకుంటారు. మంచు కొండలపై, స్నో పడుతుంటే.. పండగను జరుపుకోవాలని ఎవరికుండదు. అందుకే దేశంలోనే అందమైన ప్రదేశం, హాట్ ఫేవరెట్ టూరిస్ట్ స్పాట్ షిమ్లాకు క్యూ కట్టారు జనాలు. వందల్లో కాదు.. వేలల్లోనే ఈ ప్రాంతానికి తరలివచ్చారు. గత మూడు రోజుల్లో 55,000 వాహనాలు షిమ్లాకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో షిమ్లా, మనాలి, కసోల్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. షిమ్లా డైరెక్టర్ జనరల్ సంజయ్ కుండు తెలిపిన వివరాల ప్రకారం.. అటల్ టన్నెల్ ద్వారా షిమ్లా, మనాలికి గత మూడు రోజుల్లో 55వేల వాహనాలు ప్రవేశించాయట. దాదాపు 12వేల వాహనాలు ఇంకా.. ఆ టన్నెల్ బయటే ఉన్నాయట.

పెద్ద ఎత్తున టూరిస్టులు రావడంతో పార్కింగ్ ఇబ్బంది తలెత్తుతుందని అధికారులు చెప్తున్నారు. పార్కింగ్ స్థలాలు లేక చాలామంది రోడ్డు పక్కనే వాహనాలను నిలుపుకుని ఉన్నారు. కాగా న్యూ ఇయర్ వీక్ కూడా రావడంతో.. పర్యటకుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆ సమయానికల్లా దాదాపు లక్ష మంది షిమ్లా ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంది. దీంతో అక్కడి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. పర్యటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నారు. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం సుఖ్ విందర్ సింగ్ సుఖు తెలిపారు.


Updated : 25 Dec 2023 10:30 AM GMT
Tags:    
Next Story
Share it
Top