Home > జాతీయం > Viral Video: పిల్లిని ఎత్తుకెళ్లాలని చూసిన డేగ.. అడ్డుపడిన కారు అద్దం

Viral Video: పిల్లిని ఎత్తుకెళ్లాలని చూసిన డేగ.. అడ్డుపడిన కారు అద్దం

Viral Video: పిల్లిని ఎత్తుకెళ్లాలని చూసిన డేగ.. అడ్డుపడిన కారు అద్దం
X

మృగరాజు వేట నుండి డేగ కళ్ల నుండి ఏ ప్రాణి అయిన తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. డేగ కళ్లకు, సింహం వేటకు చిక్కిన దేనికికైనా దాదాపు భూమిపై నూకలు చెల్లినట్లే.. సింహం వేట అనేది నేరుగా చూసిన సందర్భాలు చాలా తక్కువ కాని

డేగ వేటను మాత్రం మనం చాలా సార్లు ప్రత్యక్షంగా చూసి ఉంటాం. అలా సైలెంట్‌గా వచ్చి ఇలా చటుక్కున ఎగరేసుకోమని పోతుంది. అయితే అన్ని సార్లు డేగ వేట విజయవతం కాకపోవచ్చు. కొన్ని అవరోధాలు ఏర్పడవచ్చు.

ఇక తాజాగా ఓ డేగ.. పిల్లి కూనను ఎగేసుకోవడానికి ప్రయత్నించిన తీరుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఆహారం కోసం తిరుగుతున్న ఓ డేగకు ఓ కారులో ఉన్న ఓ పిల్ల కూన కనిపిస్తుంది. దీంతో అక్కడి వచ్చి వాలిన డేగ ఆ పిల్ల కూనను ఎత్తుకెళ్ళాలని ప్రయత్నిస్తుంది. కాని డేగకు. పిల్లికి కారు అద్దం అడ్డుగా ఉండడంతో ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాదు. కొద్దిసేపటి తర్వాత పిల్లి కారు స్పీడో మీటర్ బోర్డులోకి దూరుతుంది . దీంతో అసలు విషయం అర్థమైన డేగ సైలెంట్‌గా అక్కడి నుండి జారుకుంటుంది. . ఈ సీన్ మొత్తాన్ని కారు యజమాని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక వీడియోపై నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ‘‘డేగ ఆకలికి కారు అడ్డుపడింది ’’ అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా ‘‘పాపం పిల్లి.. చాలా భయపడింది’’అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో 6 లక్షలకు పైగా లైక్‌లు రాగా వేలాల్లో కామెంట్స్ వస్తున్నాయి.

Updated : 7 Jan 2024 11:04 AM IST
Tags:    
Next Story
Share it
Top