మోదీపై కామెంట్స్.. మాల్దీవులకు ఫ్లైట్ బుకింగ్స్ నిలిపేసిన ఈజ్‌మైట్రిప్
X
ప్రధాని మోదీపై మంత్రుల అనుచిత వ్యాఖ్యలతో మాల్దీవులు భారీ నష్టం మూటగట్టుకుంటోంది. మోదీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇప్పటికే భారత్కు చెందిన ఎంతో మంది మాల్దీవుల టూర్ను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. మాల్దీవుల్లోని హోటళ్లలో భారతీయులు చేసుకున్న దాదాపు 10,500 బుకింగ్స్, 5520 ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఇంత పెద్దఎత్తున బుకింగ్స్ క్యాన్సిల్ కావడం మాల్దీవుల చరిత్రలో ఇదే మొదటిసారి. ఇదే క్రమంలో మాల్దీవులుకు ఈజ్ మై ట్రిప్ షాకిచ్చింది. ఆ దేశానికి ఫ్లైట్ బుకింగ్స్ నిలిపేయాలని నిర్ణయించింది. ఈ సంస్థను 2008లో నిషాంత్ పిట్టి, రికాంత్ పిట్టి, ప్రశాంత్ పిట్టి స్థాపించారు. ఢిల్లీ కేంద్రంగా ఈజ్ మై ట్రిప్ సేవలు అందిస్తోంది.
కాగా ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులపై మాల్దీవులు ప్రభుత్వం ఇప్పటికే వేటు వేసింది. మంత్రులు మరియం షియునా, మల్షా షరీఫ్ , మహ్జూమ్ మజీద్లను మంత్రి వర్గం నుంచి సస్పెండ్ చేసింది. మరియం షియునా చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని.. ఆమె వ్యాఖ్యలతో మాల్దీవులు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ఆ దేశ విదేశాంగ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై అక్కడి ప్రభుత్వం వేటు వేసింది.
కాగా ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్లోపర్యటించారు. ఈ సందర్భంగా సముద్రం ఒడ్డున కూర్చొని కాసేపు సేద తీరారు. అంతేకాకుండా సముద్రంలో స్నార్కెలింగ్ చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. వీటిపై మాల్దీవుల యూత్ ఎంపవర్‌మెంట్ డిప్యూటీ మంత్రి మరియం షియునా అనుచిత వ్యాఖ్యలు చేశారు. మోదీని ఇజ్రాయెల్ తోలుబొమ్మ అని పేర్కొంటూ ట్వీట్ చేసింది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. భారత్ కూడా ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఆమె సోషల్ మీడియా అకౌంట్ల నుంచి ఆ పోస్టులను డిలిట్ చేసింది.
In solidarity with our nation, @EaseMyTrip has suspended all Maldives flight bookings ✈️ #TravelUpdate #SupportingNation #LakshadweepTourism #ExploreIndianlslands #Lakshadweep#ExploreIndianIslands @kishanreddybjp @JM_Scindia @PMOIndia @tourismgoi @narendramodi @incredibleindia https://t.co/wIyWGzyAZY
— Nishant Pitti (@nishantpitti) January 7, 2024