Home > జాతీయం > Irctc Railway Booking : ప్రయాణికులకు విజ్ఞప్తి.. . రైలు టికెట్‌ పొందడం ఇంకా సులభమండి

Irctc Railway Booking : ప్రయాణికులకు విజ్ఞప్తి.. . రైలు టికెట్‌ పొందడం ఇంకా సులభమండి

Irctc Railway Booking : ప్రయాణికులకు విజ్ఞప్తి.. . రైలు టికెట్‌ పొందడం ఇంకా సులభమండి
X

రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా రైల్వే శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. క్యూ లైన్లో నిలబడి టికెట్ కోసం వెచి చూసే బదులుగా ఏటీవీఎం ,మెుబైల్ యాప్ ద్వారా సులభంగా టికెట్స్ పొందేలా మరిన్ని ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం ఆటోమేటిక్‌ టికెట్‌ వెండింగ్‌ మెషిన్‌(ATVM), మొబైల్‌ టికెటింగ్‌ యాప్‌(MTA)లు రైల్వే స్టెషన్‌లలో ఇప్పటికే అందుబాటులో తీసుకొచ్చింది. వీటి ద్వారా కౌంటర్ల వద్ద వరుసలో నిలబడకుండా అన్‌రిజర్వుడ్‌ టికెట్లు, ప్లాట్‌ఫామ్‌ టికెట్లు, సీజనల్‌ టిక్కెట్‌లను సులభంగా పొందే అవకాశం ఉంది.

ఏటీవీఎం మిషన్‌లో టికెట్ తీసుకునే విధానం

ఏటీవీఎం మిషన్‌లో రైల్వే స్మార్ట్‌ కార్డు ఉపయోగించి టికెట్స్ పొందవచ్చు. స్మార్ట్‌ కార్డు లేనివారు క్యూఆర్‌ కోడ్‌‌ను స్కాన్ చేసి సాధారణ టికెట్లు, ప్లాట్‌ఫామ్‌ టికెట్లు తీసుకోవచ్చు. అలాగే సీజనల్‌ టికెట్లను రెన్యూవల్‌ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది

ముందుగా చేరాల్సిన గమ్య స్థానం.. ఎక్కాల్సిన రైలు, క్లాస్, ఎన్ని టికెట్లు అనే వివరాలను నమోదు చేయాలి.

అనంతరం టికెట్లు కొనేందుకు చెల్లింపు విధానం ఎంచుకోవాల్సి ఉంటుంది

స్మార్ట్‌ కార్డు ద్వారా టికెట్‌ కొనుగోలు చేస్తే కార్డ్‌ రీడర్‌లో స్మార్ట్‌ కార్డును ఉంచాలి.

ఒకవేళ యూపీఐ ద్వారా కొనుగోలు చేస్తే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలి.

చెల్లింపులు పూర్తయిన తర్వాత ఏటీవీఎం నుంచి టికెట్‌ వస్తుంది.

మొబైల్‌ యాప్‌ ద్వారా టికెట్ కొనుగోలు చేసే విధానం

ముందుగా యూటీఎస్‌ యాప్‌ను స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసి ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.

తర్వాత యాప్‌లో మీ వివరాలు నమోదు చేసి సైన్‌ అప్‌ చేయాలి.

ఇప్పటికే ఈ యాప్ వినియోగిస్తున్నవారు అయితే పాస్‌వర్డ్‌తో నేరుగా లాగిన్‌ అవ్వా లి.

డ్రాప్‌డౌన్‌ మెనులో వెళ్లాల్సిన రైల్వేస్టేషన్‌ను ఎంచుకోవాలి

ఎక్కువగా రైల్వేలో ప్రయాణించేవారు అయితే క్విక్‌ బుకింగ్‌ ఎంపిక చేసుకోవాలి.

ఆర్‌-వేలెట్‌, పేటీఎం, ప్రీఛార్జ్‌, పోన్ పే ద్వారా టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు.

జనరల్ టికెట్స్ కొనుగోలు చేసేవారు ఎక్కిన స్టేషన్ నుండి అయిదు కిలోమీటర్ల పరిధిలో ఉంటేనే టికెట్ బుక్‌ చేసుకోవచ్చు.

మొబైల్‌ ఫోన్‌లో ఉండే టికెట్‌ బుకింగ్‌ వివరాలను టీటీఈకి చూపించి జర్నీ కొనసాగించవచ్చు

Updated : 12 Jan 2024 6:53 AM IST
Tags:    
Next Story
Share it
Top