ఓటర్ల ఫిర్యాదు.. కేంద్రానికి ఈసీ హెచ్చరిక
ఓటర్ల ఫిర్యాదు.. కేంద్రానికి ఈసీ హెచ్చరిక
X
లోక్ సభ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం.. కేంద్ర ప్రభుత్వానికి షాకిచ్చింది. వికసిత్ భారత్ పేరుతో బీజేపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న క్యాంపెయిన్ ను వెంటనే నిలిపేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. పౌరుల వాట్సాప్ కు వికసిత్ భారత్ మెసేజ్ లు వస్తున్నాయి. దీన్ని తక్షణమే నిలిపేయాలని ఈసీ కేంద్రానికి నోటీసులిచ్చింది. ఇక నుంచి ఎలాంటి మెసేజ్ లు డెలివరీ చేయొద్దని ఆదేశించింది.
కాగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. కేంద్రం వాట్సాప్ మెసేజ్ లు పంపడాన్ని పలువురు పౌరులు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకురన్నట్లు తెలిపింది. దీనిపై స్పందించిన ఐటీ శాఖ.. ఎన్నికల కోడ్ కంటే ముందుగానే మెసేజ్ లు పంపినా.. నెట్వర్క్ ఇష్యూ వల్ల అవి ఇప్పుడు డెలివరీ అవుతున్నాయని తెలిపింది.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.