కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీ పొడిగింపు
X
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఏడు రోజుల వరకు ఈడీ కస్టడీ కోరగా నాలుగు రోజుల వరుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజుతో క్రేజీవాల్ కస్టడీ ముగియనుండగా కోర్టులో ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఏప్రిల్1 వరుకు పొడిగిస్తూ తీర్పునిచ్చింది.
కాగా ఈ రోజు ఉదయం.. లిక్కర్ స్కాం కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న కస్టడీలో ఉన్న ఆయన సీఎం పదవి నుంచి తొలగించాలని వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారించింది. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు.. ఆ పిటిషన్ ను తోసిపుచ్చింది. ముఖ్యమంత్రిని పదవి నుంచి తొలగించే అంశం తమ పరిధిలోకి రాదని.. ఇది పూర్తిగా రాజకీయాలతో ముడిపడి ఉన్న అంశం కావడంతో తాము జోక్యం చేసుకోలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసిన కొన్ని గంటలకే.. కస్టడీ పొడిగిస్తూ.. కేజ్రీవాల్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.