Home > జాతీయం > లాలూ, తేజస్వీ యాదవ్‌లకు మరోసారి ఈడీ నోటీసులు

లాలూ, తేజస్వీ యాదవ్‌లకు మరోసారి ఈడీ నోటీసులు

లాలూ, తేజస్వీ యాదవ్‌లకు మరోసారి ఈడీ నోటీసులు
X

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సహా ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ల్యాండ్ ఫర్ జాబ్ స్కాంలో వారిని ఈడీ విచారించనుంది. 29న లాలూ ప్రసాద్ యాదవ్, 30న తేజస్వీ యాదవ్ తమ ఎదుట హాజరు కావాలని ఆ నోటీసుల్లో ఈడీ స్పష్టం చేసింది. డిసెంబర్లోనూ ఈడీ వారికి నోటీసులు ఇచ్చింది. డిసెంబరు 22న తేజస్వీ యాదవ్‌, 27న లాలూ విచారణ రావాల్సిందిగా నోటీసులు జారీ చేయగా.. వారు వెళ్లలేదు. ఈ క్రమంలో ఇవాళ ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు.

యూపీఏ ప్రభుత్వంలో లాలూ రైల్వే మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో లాలూ కుటుంబసభ్యులు కొంతమంది దగ్గర భూములు తీసుకుని వారికి రైల్వే ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2022లో సీబీఐ లాలూ, రబ్రీదేవి, తేజస్వీపై ఛార్జ్షీట్ దాఖలు చేసింది. తేజస్వీ సన్నిహితుడైన అమిత్ కత్యాల్ను గతంలో ఈడీ అరెస్ట్ చేసింది. మొత్తం ఈ వ్యవహారంలో 600కోట్లపైగా కుంభకోణం జరిగినట్లు ఈడీ ఆరోపిస్తోంది.


Updated : 19 Jan 2024 8:54 PM IST
Tags:    
Next Story
Share it
Top