Home > జాతీయం > Kejriwal : ఈడీ నోటీసులు చట్ట విరుద్ధం అయినా వస్తా...కేజ్రీవాల్

Kejriwal : ఈడీ నోటీసులు చట్ట విరుద్ధం అయినా వస్తా...కేజ్రీవాల్

Kejriwal : ఈడీ నోటీసులు చట్ట విరుద్ధం అయినా వస్తా...కేజ్రీవాల్
X

ఢిల్లీ లిక్కర్ కేసులో తాను విచారణకు హాజరయ్యేందుకు సిద్ధం అన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. అయితే గత కొంతకాలంగా ఈడీ సమన్లను తిరస్కరిస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈడీ నోటీసులు చట్టవిరుద్ధమే అయినా విచారణకు తాను సిద్ధమేనన్నారు. అయితే, మార్చ్ 12 తరువాత విచారణ తేదీని ఖరారు చేయాలని సూచించారు.

అయితే ఇప్పటికే విచారణకు రావాలని కేజ్రీవాల్ కు ఈడీ ఎనిమిది సార్లు నోటీసులు జారీ చేసింది. వీటన్నింటికి డుమ్మా కొట్టిన సీఎం తాజాగా ఈడీకి తన సమాధానం పంపారు. ఈడీ నోటీసులు చట్ట విరుద్ధమని మరోసారి ఆరోపించారు. అయితే, మార్చి 12 తర్వాత వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరవుతానని చెప్పినట్లు తెలుస్తోంది.

ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు గతేడాది నవంబర్‌ 2న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తొలిసారి నోటీసులు జారీ చేసింది. అనంతరం వరుసగా నోటీసులు పంపిస్తున్నప్పటికీ కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. ఎన్నిసార్లు నోటీసులు పంపినా సీఎం ఈడీ కొద్దిరోజుల క్రితం కోర్టును ఆశ్రయించింది. ఈ ఫిర్యాదుపై ఇటీవల కోర్టు నోటీసులు జారీ చేయడంతో కేజ్రీవాల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరయ్యారు. కేజ్రీవాల్ అభ్యర్థన మేరకు తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ఆ రోజు వ్యక్తిగతంగా కేజ్రీవాల్ కోర్టులో హాజరుకానున్నారు.




Updated : 4 March 2024 11:39 AM IST
Tags:    
Next Story
Share it
Top