Home > జాతీయం > ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఆప్ ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు..

ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఆప్ ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు..

ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఆప్ ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు..
X

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు పెంచింది. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. సంజయ్ సన్నిహితుల ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్న దినేష్ అరోరా ఎంపీ సంజయ్ సింగ్ ను కలిసినట్లు విచారణలో తెలిపారు. ఆ తర్వాత మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతోనూ భేటీ అయినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే అధికారులు ఎంపీ ఇంటితో పాటు ఆయన సన్నిహితుల ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారు.

దినోష్ అరోరా మొదట సంజయ్ సింగ్ను కలిశారు. ఎంపీ ద్వారా సీఎం మనీష్ సిసోడియాను కలిసినట్లు అధికారులు తెలిపారు. పార్టీ నిధుల కోసం రెస్టారెంట్ల యజమానుల నుంచి 32లక్షల చెక్కులను దినేష్ అరోరా సిసోడియాకు ఇచ్చారని ఈడీ అభియోగాలు మోపింది. అంతేకాకుండా లిక్కర్ డిపార్ట్మెంట్తో దినేష్ అరోరాకు ఉన్న సమస్యను సంజయ్ సెటిల్ చేశారని ఆరోపించింది.

మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవ్, దినేష్‌ అరోరా అప్రూవర్లుగా మారేందుకు ఢిల్లీ సీబీఐ కోర్డు అనుమతించింది. ఈ మేరకు సీబీఐ స్పెషల్‌ కోర్టు ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో మాగుంట రాఘవ, దినేష్ అరోరా ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. ఇదే కేసులో మరో నిందితునిగా ఉన్న అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌చంద్రారెడ్డి గతంలోనే అప్రూవర్‌గా మారారు.

Updated : 4 Oct 2023 5:05 AM GMT
Tags:    
Next Story
Share it
Top