Home > జాతీయం > Pakistan : పాక్లో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తులు...తెరపైకి బిలావల్ భుట్టో పేరు

Pakistan : పాక్లో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తులు...తెరపైకి బిలావల్ భుట్టో పేరు

Pakistan : పాక్లో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తులు...తెరపైకి బిలావల్ భుట్టో పేరు
X

పాకిస్థాన్‌లో నవాజ్‌ షరీఫ్‌ ఆ దేశ పగ్గాలు చేపట్టేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. ఆదివారం షరీఫ్‌ ఆధ్వర్యంలో పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌), బిలావల్‌ భుట్టో జర్దారీ నాయకత్వంలోని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ)లు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కొన్ని సూచనలతో ఒప్పుకున్నాయి. ఈ చర్చల్లో అధికార పంపకంపై కొన్ని కీలకమైన అంశాలు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. తమ ఛైర్మన్‌ బిలావల్‌ భుట్టో జర్దారీకి ప్రధాని పదవి కావాలని పీపీపీ వర్గాలు గట్టిగా పట్టుబడినట్లు సమాచారం. అయితే అధికారాన్ని మూడేళ్లు పీఎంఎల్‌-ఎన్‌, రెండేళ్లు పీపీపీ పంచుకోవాలన్న అంశంపై చర్చలు జరుగుతోందని బిలావల్ వర్గాలు చెబుతున్నాయి. కాగా అధికార పగ్గాలను ముందు ఏ పార్టీ స్వీకారించాలన్నది ఇంకా క్లారిటీ రాలేదని సమాచారం. పీఎంఎల్‌-ఎన్‌ తరఫున నవాజ్‌ షరీఫే ప్రధాని బాధ్యతలు చేపట్టే అవకాశం లేకపోలేదు. పాక్లో రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో 265 జాతీయ అసెంబ్లీ సీట్లకు గాను పీఎంఎల్‌-ఎన్‌కు 75 స్థానాలు దక్కించుకుంది.

అయితే ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన ఉన్న పీటీఈ పార్టీ నుంచి స్వతంత్రులుగా పోటీచేసిన అభ్యర్థులు అందరికన్నా ఎక్కువగా 101 స్థానాలు గెలిచారు. ఇటు పీఎంఎల్‌-ఎన్‌ అధికారంలోకి రావాలంటే 54 సీట్లలో గెలుపొందిన పీపీపీతో చేతులు కలపడం తప్పనిసరి. పీఎంఎల్‌-ఎన్‌, పీపీపీ పార్టీలు కలిస్తే మొత్తం 129 సీట్లు అవుతాయి. ఇప్పటికే ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు కూడా పార్టీలో చేరినట్లు పీఎంఎల్‌-ఎన్‌ ప్రకటించింది. 17 సీట్లు నెగ్గిన ఎంక్యూఎం-పీతోనూ చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. మరోవైపు పీఎంఎల్‌-ఎన్‌, పీపీపీ ఏర్పరిచే సంకీర్ణ ప్రభుత్వంలో..తాము ఎట్టి పరిస్థితుల్లో చేరమని పీటీఐ పార్టీ స్పష్టం చేసింది. వారితో కూటమి కట్టే కంటే.. ప్రతిపక్షంలో కూర్చోడమే మంచిదని తెలిపింది.


Updated : 13 Feb 2024 1:44 AM GMT
Tags:    
Next Story
Share it
Top