ఎన్నికల ప్రచారకర్తగా క్రికెట్ దిగ్గజం సచిన్
X
మరి కొద్ది నెలల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్లు జరుగనున్నాయి. అదే విధంగా వచ్చే సంవత్సరం పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న ఎన్నికల్లో ప్రజలు విస్తృతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా వారిలో చైతన్యాన్ని తీసుకువచ్చేందుకు భారత క్రికెట్ దిగ్గజాన్ని రంగంలోకి దింపుతోంది. లెజండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను ‘నేషనల్ ఐకాన్'గా నియమించింది. ఈ మేరకు ఇవాళ ఈసీ, సచిన్‌తో ఒప్పందం కుదుర్చుకోనుంది.
భారత ఎన్నికల సంఘం త్వరలో జరుగనున్న ఎన్నికల ప్రచారానికి లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను నేషనల్ ఐకాన్‌గా సెలెక్ట్ చేసింది. ఇవాళ ఈసీ, సచిన మధ్య అవగాహన ఒప్పందం కుదరనుంది. రానున్న ఎన్నికల్లో ఓటర్లు పెద్దసంఖ్యలో తమ ఓటుహక్కును ఉపయోగించుకునే విధంగా సచిన్ వారికి అవగాహన కల్పించనున్నారు. మూడేళ్ల పాటు సచిన ప్రచారక్తగా వ్యవహరించనున్నారు. ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున అవగాహన కల్పించనున్నారు. ముఖ్యంగా సిటీ ప్రజలు, టీనేజర్లు ఓటింగుపై నిర్లక్ష్యం చూపుతున్న నేపథ్యంలో వారిలో చైతన్యం తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటారు. క్రికెట్ దిగ్గజం సచిన్ ప్రచారకర్త కావడం వల్ల రాబోయే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో యువత ఎక్కువగా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుందని ఈసీ భావిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ ఎం.ఎస్.ధోనీ, అమీర్‌ఖాన్, మేరీకోమ్‌లను నేషనల్ ఐకాన్స్‌గా నియమించింది.