Home > జాతీయం > ఈసీ కొత్త ఆన్‌లైన్‌ పోర్టల్‌.. పార్టీలు లెక్క చెప్పాల్సిందే..

ఈసీ కొత్త ఆన్‌లైన్‌ పోర్టల్‌.. పార్టీలు లెక్క చెప్పాల్సిందే..

ఈసీ కొత్త ఆన్‌లైన్‌ పోర్టల్‌.. పార్టీలు లెక్క చెప్పాల్సిందే..
X

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఆన్‌లైన్‌ పోర్టల్‌ను ప్రారంభించింది. ఇకపై ఈ పోర్టల్‌లోనే రాజకీయ పార్టీలు తమ ఆర్థిక వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. ఆర్థిక వివరాలతో పాటు ఎన్నికలకు సంబంధించి ఖర్చులు, పార్టీకి వచ్చిన విరాళాలు తదితర వివరాలను ఈ పోర్టల్‌ ద్వారా అందించవచ్చు.

ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించే లక్ష్యంతో ఈ పోర్టల్‌ను తీసుకొచ్చినట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ‘‘రాజకీయ పార్టీలు తమ ఫైనాన్షియల్ అకౌంట్స్‌కి సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లోనే సబ్మిట్ చేసేందుకు ఈ అవకాశం కల్పిస్తున్నాం. ఎన్నికల వ్యయంపై పారదర్శకత ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. అన్ని వివరాలు ఆన్‌లైన్‌లో ఉండటం వల్ల అకౌంటబిలిటీ కూడా పెరుగుతుంది’’ అని ఈసీ తెలిపింది.

ఫిజికల్ రిపోర్ట్స్‌ని సబ్మిట్ చేయడంలో సమస్యలు తలెత్తుతున్నాయని, వాటికి పరిష్కారంగానే ఈ కొత్త పోర్టల్ తీసుకొచ్చామని అధికారులు వెల్లడించారు. ఏదైనా ఓ పార్టీ ఆన్‌లైన్‌ ఈ లెక్కలు సబ్మిట్ చేయకపోతే..అందుకు కారణాలేంటో ఎన్నికల సంఘానికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో సమర్పించకపోతే నిర్దేశించిన ఫార్మాట్‌లో సీడీలు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ కాపీ ఫార్మాట్‌లో నివేదికను అందజేయాలని స్పష్టం చేసింది.

Updated : 3 July 2023 7:27 PM IST
Tags:    
Next Story
Share it
Top