Home > జాతీయం > ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. లడఖ్‌లో తొలి ఎన్నికలు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. లడఖ్‌లో తొలి ఎన్నికలు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. లడఖ్‌లో తొలి ఎన్నికలు.
X

జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని.. కేంద్ర ప్రభుత్వం 2019లో రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు చేసి ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించారు. ఈ క్రమంలో కార్గిల్ జిల్లాలోని లడఖ్ లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ లోని 26 స్థానాల కోసం 85 మంది అభ్యర్థులు పోటీ పడగా.. ఈ ఎన్నికల్లో మొత్తం 77.61 శాతం ఓటింగ్ నమోదయింది. ఈ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడుతాయి. కాగా ఈ ఎన్నికల సందర్భంగా ఓటరు గుర్తింపు కోల్పోయినట్లు చాలామంది ప్రజలు ఆరోపించారు.

అంతేకాకుండా ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడిన లడఖ్ లో ప్రజాస్వామ్య ప్రాతినిధ్యం లేదని వాపోయారు. జమ్ముకశ్మీర్ నుంచి తమ ప్రాంతాన్ని విడగొట్టినందుకు కొంతమంది కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రయోగం విఫలం అయినందుకు.. తమ ప్రాంతాన్ని తిరిగి జమ్ముకశ్మీర్ లో కలపాలని మరికొందరు డిమాండ్ చేశారు. జమ్ముకశ్మీర్ మొత్తానికి రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని నినాదాలు చేశారు.




Updated : 4 Oct 2023 4:19 PM GMT
Tags:    
Next Story
Share it
Top