Home > జాతీయం > S Nariman : పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, ప్రముఖ న్యాయవాది కన్నుమూత

S Nariman : పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, ప్రముఖ న్యాయవాది కన్నుమూత

S Nariman : పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత,  ప్రముఖ న్యాయవాది కన్నుమూత
X

ప్రముఖ న్యాయవాది ఫాలీ ఎస్‌ నారీమన్‌ ఇకలేరు. గత కొంత కాలంగా వృద్ధాప్య సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇవాళ (బుధవారం) ఉదయం కన్నూమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 95 సంవత్సరాలు. ఫాలీ నారీమన్‌ సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయవాది. నారీమన్‌ .. 1991 నుంచి 2010 వరకు ఆయన బార్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాకు అధ్యక్షుడిగా పనిచేశారు. న్యాయవాద వృత్తిలో ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1991లో పద్మభూషణ్‌, 2007లో పద్మవిభూషణ్‌ పురస్కారాలతో సత్కరించింది. అదేవిధంగా 1999 నుంచి 2005 వరకు రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు.

ఫాలీ ఎస్ నారిమన్ నారిమన్ 1929 జనవరి 10న మయన్మార్ లోని పార్సీ కుటుంబంలో జన్మించారు. బాంబే హైకోర్టులో లా ప్రాక్టీస్ ప్రారంభించారు. 38 ఏళ్ల వయసులో హైకోర్టు న్యాయమూర్తిగా ఉండటానికి వచ్చిన ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించారు. 1971 నుంచి సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేశారు.

నారీమన్ మృతి పట్ల మాజీ న్యాయశాఖ మంత్రి, సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ సంతాపం వ్యక్తం చేశారు. ‘‘ భరతమాత(భారతదేశ) కుమారుడు మరణించాడు. ఆయన మన దేశంలోని గొప్ప న్యాయవాదులలో ఒకరు మాత్రమే కాదు, అన్నింటికంటే గొప్పగా నిలిచిన అత్యుత్తమ మానవుల్లో ఒకరు. అతను లేని కోర్టు కారిడార్లు ఎప్పటికీ ఒకేలా ఉండవు. . ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’’ అని ఎక్స్ లో ట్వీట్ చేశారు.

Updated : 21 Feb 2024 5:02 AM GMT
Tags:    
Next Story
Share it
Top