Home > జాతీయం > Encounter In Jammu Kashmir: ఉగ్ర‌వాదుల‌తో ఎన్‌కౌంట‌ర్.. ఇద్ద‌రు సైనికుల వీర మరణం

Encounter In Jammu Kashmir: ఉగ్ర‌వాదుల‌తో ఎన్‌కౌంట‌ర్.. ఇద్ద‌రు సైనికుల వీర మరణం

Encounter In Jammu Kashmir: ఉగ్ర‌వాదుల‌తో ఎన్‌కౌంట‌ర్.. ఇద్ద‌రు సైనికుల వీర మరణం
X

జమ్మూకాశ్మీర్ లోని రాజోరి జిల్లా బాజిమల్ ప్రాంతంలో నిన్న భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఆ ఎన్ కౌంటర్లో నలుగురు సైనికులు వీరమరణం పొందారు. మరోముగ్గురు గాయపడినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. చనిపోయిన వారిలో ఇద్దరు ఆర్మీ అధికారులు, ఇద్దరు జవాన్లు ఉన్నారని అధికారులు వెల్లడించారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్ తర్వాత ధర్మాల్ లోని బాజిమాల్ ప్రాంతంలో ఇద్దరు టెర్రరిస్టులు దాక్కున్నారు. వారిని అంతమొందించేందుకు అదనపు దళాలను మోహరించారు ఆర్మీ అధికారులు. దీంతో రాజోరి జిల్లా ప్రాంతంలో యుద్ధవాతావరణం నెలకొంది.

గాయపడ్డవారిలో ఇద్దరు కెప్టెన్లు, ఇద్దరు హవల్దార్లు ఉన్నారు. కొంతమంది ఇతర అధికారులు కూడా గాయాలయ్యాయి. గాయపడ్డ సైనికుల చికిత్స కోసం ఉదంపూర్ లోని ఆర్మీ కమాండ్ ఆస్పత్రికి తరలించారు. బాజిమాల్ లో దాక్కున్న ఇద్దరు టెర్రరిస్టులు విదేశీ పౌరులుగా అనుమానిస్తున్నారు. ఆదివారం నుంచి ఆ ప్రాంతంలో తిరుగుతున్నారని.. ప్రార్థనా మందిరాల్లో ఆశ్రయం పొందారని అధికారులు పేర్కొన్నారు.




Updated : 23 Nov 2023 8:07 AM IST
Tags:    
Next Story
Share it
Top