Home > జాతీయం > బీజేపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఏనుగు రవీందర్ రెడ్డి!!!

బీజేపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఏనుగు రవీందర్ రెడ్డి!!!

బీజేపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఏనుగు రవీందర్ రెడ్డి!!!
X

తెలంగాణలో కమలం పార్టీకి మరో షాక్ తగిలే అవకాశం ఉందని తెలుస్తోంది.బీజేపీ నేత ఏనుగు రవీందర్ రెడ్డి పార్టీని వీడేందుకు సమాయత్తం అవుతున్నారని తెలుస్తోంది.త్వరలోనే కమలంను వీడి హస్తం గూటికి చేరతారనే వార్తలు జోరుగా సాగుతున్నాయి.గతంలో ఈటల రాజేందర్ తో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి కాషాయ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే గత 4 రోజులుగా రవీందర్ ఈటలకు దూరంగా ఉంటున్నారు. ఈటల తన దారి తాను చూసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వకపోవడంతోనే బీజీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలిసింది.

ఈ క్రమంలోనే రవీందర్ రెడ్డి గురువారంనాడు తన అనుచరులతో సమావేశమయ్యారు . రవీందర్ రెడ్డి బీజేపీని వీడుతారనే ప్రచారం సాగుతున్న తరుణంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది. 2018 ఎన్నికల్లో ఎల్లారెడ్డి అసెంబ్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన రవీందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధి సురేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పరిణామాల్లో సురేందర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ లో సురేందర్ రెడ్డి , ఏనుగు రవీందర్ రెడ్డి వర్గాల మధ్య పొసగలేదు. దీంతో రవీందర్ రెడ్డి బీజేపీలో చేరారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అనుచరులతో రవీందర్ రెడ్డి సమావేశమయ్యారు. బీజేపీని వీడే విషయమై రవీందర్ రెడ్డి చర్చిస్తున్నట్టుగా సమాచారం. రవీందర్ రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది.

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఏనుగు రవీందర్ రెడ్డి సమావేశం కావడం కూడ ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీలో రవీందర్ రెడ్డి చేరేందుకు సన్నాహలు చేసుకుంటున్నారని ప్రచారానికి ఊతమిచ్చేలా ఈ భేటీ ఉందనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఇక బీజేపీ నాయకత్వం ఈటల రాజేందర్ కు కీలక పదవిని అప్పగించింది. బీజేపీ ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ చైర్మెన్ గా రాజేందర్ ను ఆ పార్టీ నియమించిన విషయం తెలిసిందే.

Updated : 6 July 2023 9:15 AM GMT
Tags:    
Next Story
Share it
Top