Home > జాతీయం > పీఎఫ్ డబ్బు తీసుకోవడం కష్టమే

పీఎఫ్ డబ్బు తీసుకోవడం కష్టమే

పీఎఫ్ డబ్బు తీసుకోవడం కష్టమే
X

ఈపీఎఫ్​ఓ (ఎంప్లాయీస్​ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్).. తనకు వచ్చిన ప్రతి మూడవ లోన్​క్లెయిమ్‌‌ను రిజెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్​ ఫైనల్​ సెటిల్‌‌మెంట్ కోసం మొత్తం 73.87 లక్షల అప్లికేషన్లు రాగా.. వీటిలో 33.8 శాతం (24.93 లక్షలు) అప్లికేషన్లను రిజెక్ట్ చేయబడ్డాయి.

అయితే వీటిలోని 46.66 లక్షలు క్లెయిమ్స్​ను సెటిల్​ చేశారు. కాగా 2017-18, 2018-19లో ఉన్న రిజెక్షన్​ రేటు కంటే ఇది చాలా ఎక్కువ అని విశ్లేషకులు చెప్తున్నారు. 2019-20లో ఫైనల్ ​సెటిల్మెంట్ క్లెయిమ్‌‌ల రిజెక్షన్లు 24.1 శాతం ఉన్నాయి. 2020-21లో అవి 30.8 శాతానికి పెరగగా.. 2021-22లో ఇది 35.2 శాతానికి చేరింది. వీటివల్ల తమపై విపరీతంగా పనిభారం ఉందని ఈపీఎఫ్​ఓ ఉద్యోగులు అంటున్నారు.

Updated : 25 Feb 2024 8:01 AM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top