Home > జాతీయం > Modi : బాంబు పేలుళ్లు, స్కామ్‌లు.. కాంగ్రెస్ హయాంలో జరిగిందిదే.. ప్రధాని మోదీ

Modi : బాంబు పేలుళ్లు, స్కామ్‌లు.. కాంగ్రెస్ హయాంలో జరిగిందిదే.. ప్రధాని మోదీ

Modi : బాంబు పేలుళ్లు, స్కామ్‌లు.. కాంగ్రెస్ హయాంలో జరిగిందిదే.. ప్రధాని మోదీ
X

కాంగ్రెస్ పార్టీకి మోదీని తిట్టడం తప్ప మరో ఎజెండా లేదని విమర్శించారు ప్రధాని నరేంద్ర మోదీ. వికసిత్ భారత్ పేరు పలకడానికి కూడా ఆ పార్టీ నేతలకు నోరు రాదని విమర్శించారు. నెగిటివ్ ఆలోచనలతో ఉండే కాంగ్రెస్, పాజిటివ్ నిర్ణయాలు తీసుకోలేదన్నారు. రాజస్థాన్‌లో రూ.17 వేల కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ.. వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. 2014 ముందు భారత్ దారుణమైన స్థితిలో ఉండేదని విమర్శించారు. బాంబు పేలుళ్లు, స్కామ్‌లు తప్ప కాంగ్రెస్ హయాంలో జరిగింది ఏమీ లేదని మండి పడ్డారు. ఆ పార్టీకి దూరదృష్టి లేకపోవడం వల్లే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ హయాంలో దేశవ్యాప్తంగా విద్యుత్‌కి లోటు ఉండేదని విమర్శించారు. రాజస్థాన్‌కి కాంగ్రెస్ ఇచ్చిన దానికన్నా ఆరు రెట్లు ఎక్కువగా బీజేపీ ఇచ్చిందని వెల్లడించారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఇన్నాళ్లకు భారత్‌ అభివృద్ధిని చూస్తోందన్నారు. పదేళ్ల క్రితం భారత్ చాలా విషయాల్లో వెనకబడి ఉందని.. కానీ...ఇప్పుడు రోజులు మారిపోయాయన్నారు. రోజురోజుకీ దేశం ముందుకు దూసుకెళ్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దేశాన్ని అంధకారం నుంచి బయటపడేశామన్నారు. వికసిత్ భారత్ అనే పేరు కూడా కాంగ్రెస్ పలకదని, మోదీ అందుకోసమే పని చేస్తున్నాడని తనపై అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు." వోకల్ ఫర్ లోకల్, మేడిన్ ఇండియా నినాదాలకూ వాళ్లు మద్దతునివ్వరు. మోదీ ఏం చేసినా దాన్ని వ్యతిరేకించడమే కాంగ్రెస్ పని. మోదీ విరోధ్, ఘోర్ మోదీ విరోధ్ అనే ఎజెండాతోనే పని చేస్తున్నారు. అందుకే పార్టీలోని కీలక నేతలంతా వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం ఒక్క కుటుంబమే మిగిలిపోయింది" అని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని, ప్రగతిశీల ఆలోచనలతో సానుకూల విధానాలు రూపొందించలేకపోవడం కాంగ్రెస్‌కు పెద్ద సమస్య అని ప్రధాని అన్నారు.




Updated : 16 Feb 2024 1:59 PM IST
Tags:    
Next Story
Share it
Top