కామెంటేటర్ గా కొత్త అవతారం ఎత్తిన ఇషాంత్ శర్మ
X
చాలాకాలంగా క్రికెట్ ఆటకు దూరంగా ఉంటున్న టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ కొత్త అవతారమెత్తుతున్నాడు. వెస్టిండీస్ తో జరగనున్న టెస్ట్ సీరీస్ కు కామెంటేటర్ గా వ్యవహరించనున్నాడు. జియో సినిమాతో ఇషాంత్ ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఇషాంత్ శర్మ కామెంటేటర్ గా చేయనున్నాడని జియో సినిమా అధికారికంగా ప్రకటించింది. ఇంతకు ముందు అతను వెస్ట్ ఇండీస్ మీద సాధిచిన 10 వికెట్ల హాల్ ను చూపిస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేసింది. ఇషాంత్ శర్మ హిందీలో కామెంటరీ చెప్పనున్నారు. టీమిండియా తరుఫున ఆడిన ఇతను 105 టెస్టులు, 80 వన్డేలు, 14 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 311, వన్డేల్లో 115, టీ20ల్లో 8 వికెట్లు పడగొట్టాడు.
భారత్-వెస్టీండీస్ టెస్ట్ సీరీస్ జులై 12 నుంచి ప్రారంభం కానుంది. డొమినికా వేదికగా మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. దీనికి సంబంధించిన టీమ్ లను ఇరు జట్లు ఇప్పటికే ప్రకటించాయి.