తగ్గని ఎండలు..వేసవి సెలవులు పొడిగింపు
X
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జూన్ నెలలో కూడా భానుడు భగభగ మండిపోతున్నాడు. ఉ. 9 దాటాక బయటకు రావాలంటనే భయపడిపోతున్నారు. దేశమంతటా వేడిగాలులు, తీవ్రమైన ఉష్ణోగ్రతల ప్రభావం కనిపిస్తోంది .ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు స్కూళ్ల నిర్వాహణపై కీలక నిర్ణయం తీసుకుంటున్నాయి.
జూన్ 12 నుంచే ఏపీ, తెలంగాణలో పాఠశాలలో స్కూల్స్ పున:ప్రారంభమయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలు దృష్ట్యా ఏపీ విద్యాశాఖ ఒంటి పూట బడులను నిర్వహిస్తోంది. వాతావరణంలో మార్పు కనిపించకపోవడంతో మరికొన్ని రోజులు కూడా ఒంటి పూట బడులను పొడిగించింది. మిగిలిన రాష్ట్రాల్లో కూడా వేసవి సెలవులను పొడగిస్తున్నారు. ఇప్పటికే ఛత్తీస్‌గడ్, ఒడిశా, యూపీ రాష్ట్రాలు సెలవులను పొడగించాయి. తాజాగా మధ్యప్రదేశ్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది.
ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వేసవి సెలవులను పొడిగిస్తున్నట్లు మధ్యప్రదేశ్ విద్యాశాఖ ప్రకటించింది. తాజా ఆదేశాలు ప్రకారం 1 నుంచి 5 తరగతుల ప్రైమరీ స్కూల్స్ జులై 1న రీ ఓపెన్ కానున్నాయి. ఇక ఆరు నుంచి 12 తరగతుల విద్యార్థులకు మాత్రం జూన్ 20న స్కూల్స్ ప్రారంభం కానున్నాయి.అయితే జూన్ 30 వరకు ఒంటిపూట మాత్రమే తరగతులు నిర్వహించనున్నారు. పాత షెడ్యూల్ ప్రకారం మధ్యప్రదేశ్‌లోని అన్ని స్కూల్స్ జూన్ 20న పునఃప్రారంభం కావాల్సి ఉండగా..తాజాగా వాటిని పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు.