ప్రియురాలితో భర్త రొమాన్స్...చితక్కొట్టిన భార్య..వీడియో వైరల్
X
సమాజంలో అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. భార్య లేదా భర్తలు పక్క చూపులు చూడడంతో అన్యోన్యంగా సాగాల్సిన దాంపత్య జీవితంలో గందరగోళం ఏర్పాడుతోంది. వివాహేతర సంబంధాలు కారణంగా జీవితాలు నాశనమవుతున్నాయి. సమాజంలో గౌరవం ఉండదని తెలిసినా ఎవరూ వెనక్కు తగడ్డం లేదు. తాము చేయాలనుకున్నది చేసేస్తున్నారు. దీని కోసం ఎంతవరకైనా తెగించేవారున్నారు. కోరుకున్నవారి కోసం కట్టుకున్నవారిని సైతం హత్య చేయడానికి కూడా వెనుకాడడం లేదు. ఇలాంటి వ్యవహారాలు కొందరు సీక్రెట్‌గా నడుపుతుంటే..మరికొందరు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయి రోడ్డుపై తమ పరువును పోగొట్టుకుంటున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ జిల్లాలో తన భర్తతో రొమాన్స్ చేస్తున్న ఓ యువతిని పట్టుకొని చితకబాదింది ఓ భార్య. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పూర్తి వివరాలు చూస్తే.. . బర్న్ పూర్‌లోని ఇష్పాట్ ఇంటర్నేషన్ హోటల్‌కు ఓ వ్యక్తి తన ప్రియురాలితో వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి భార్య నేరుగా హోటల్‌కు వెళ్లింది. రూంలో ఏకాంతంగా ఉన్న వారిద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని.. భర్తతో ఉన్న యువతి తాట తీసింది. రోడ్డుపైకి లాగి చితకబాదింది. హెల్మెట్‌తో దాడి చేసి..జుట్టు పట్టుకుని ఈడ్చి, కింద పడి కాలితో తన్నింది. అనంతరం వారిద్దరని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళి ఫిర్యాదు చేశారు. ఇంర్నెట్ లో భార్య దాడి చేసిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.కింద ఉన్న వీడియోపై మీరు ఓ లుక్కేయండి.
Extra-Marital affair Kalesh after wife caught her husband with a ladypic.twitter.com/0CDfQmM1JD
— Ghar Ke Kalesh (@gharkekalesh) June 27, 2023