అన్నాడీఎంకేలో చేరిన ప్రముఖ నటి
X
ప్రముఖ నటి గౌతమి ఇవాళ అన్నాడీఎంకేలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గౌతమి పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా 25 ఏళ్లపాటు బీజేపీలో ఉన్న ఆమె గత ఏడాది ఆక్టోబర్‌లో రాజీనామా చేశారు. తాను ఆపదలో ఉన్నప్పుడు పార్టీ మద్దతు ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. 25 ఏళ్ల పాటు బీజేపీలో గౌతమి ఉన్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది అక్టోబరులో కమలం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. అయితే తాను ఆపదలో ఉన్నప్పుడు పార్టీ నుంచి మద్దతు కరవైందని ఆరోపిస్తూ గౌతమి బీజేపీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఇక గౌతమి.. 2004 నుంచి 2016 వరకు విశ్వనటుడు కమల్ హాసన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఆ తర్వాత ఆయనతో విడిపోయి వేరుగా ఉంటున్నారు. అయితే గతంలో బీజేపీలో ఉన్న మరో నటి గాయత్రి రఘురామ్.. కొన్నేళ్లుగా ఆ పార్టీలోనే ఉండి.. ఇటీవలె అన్నాడీఎంకేలో చేరారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే. అన్నామలైతో విభేదాల కారణంగా గాయత్రి రఘురామ్ ఆ పార్టీని వీడి గత నెలలో ఏఐడీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు హీరో విజయ్ కూడా తమిళనాడులో కొత్త పార్టీని స్థాపించారు. కానీ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని సర్కార్ పై విమర్శలు గుప్పించారు.